Afghanistan Announce Squad For IND vs AFG T20I Series
India vs Afghanistan : అఫ్గానిస్తాన్‌తో మూడు మ్యాచుల టీ20 సిరీసే టీ20 ప్రపంచకప్ 2024కి ముందు టీమ్ఇండియా ఆడే చివరి సిరీస్ కానుంది. దీంతో ఇరు జట్లకు ఈ సిరీస్ చాలా కీలకంగా మారింది. ఈ క్రమంలో భారత్‌తో టీ20 సిరీస్‌కు 19 మందితో కూడిన జట్టును అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. కెప్టెన్సీ బాధ్యతలను ఇబ్రహీం జద్రాన్ కు అప్పగించింది.
గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రషీద్ ఖాన్ కొంత కాలం ఆటకు దూరంగా ఉన్నా ఈ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే.. అతడిని ఓ ఆటగాడిగా మాత్రమే ఎంపిక చేసింది. ఎందుకంటే వెన్నుకు ఇటీవల రషీద్ ఖాన్ శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం దీన్ని నుంచి కోలుకుంటున్నాడు. అతడు ఫిట్‌నెస్ సాధిస్తేనే భారత్‌తో సిరీస్‌లో ఆడతాడని తెలిపింది.
Cricket tournament : ధోతి-కుర్తా దుస్తులతో క్రికెట్.. ఎందుకో తెలుసా..?
ఇదిలా ఉంటే.. దేశం కోసం కాకుండా లీగ్ లు ఆడేందుకే నవీన్ ఉల్ హక్, ఫజల్‌హక్ ఫరూఖీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్ లు ప్రాముఖ్యం ఇస్తున్నారని, వీరికి సెంట్రల్ కాంట్రాక్టు ఇవ్వబోమని అఫ్గాన్ క్రికెట్ బోర్డు ఇటీవలే ప్రకటించినప్పటికీ ఆశ్చర్యకరంగా ఈ ముగ్గురిని భారత పర్యటనకు ఎంపిక చేసింది.
భారత పర్యటనకు అఫ్గానిస్థాన్ జట్టు ఇదే..
ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫజల్, ఫజల్, ఫజల్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీమ్, కైస్ అహ్మద్, గుల్బాదిన్ నాయబ్, రషీద్ ఖాన్.
భారత్ vs అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..
* జనవరి 11న తొలి టీ20 – మొహాలి
* జనవరి 14న రెండవ టీ20 – ఇండోర్
* జనవరి 17న మూడో టీ20 – బెంగళూరు
? ????? ?????! ?
AfghanAtalan Lineup revealed for the three-match T20I series against @BCCI. ?
More ?: https://t.co/hMGh4OY0Pf | #AfghanAtalan | #INDvAFG pic.twitter.com/DqBGmpcIh4
— Afghanistan Cricket Board (@ACBofficials) January 6, 2024