Cricket tournament : ధోతి-కుర్తా దుస్తుల‌తో క్రికెట్.. ఎందుకో తెలుసా..?

మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని భోపాల్ న‌గ‌రంలో జ‌రుగుతున్న ఓ క్రికెట్ టోర్న‌మెంట్‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Cricket tournament : ధోతి-కుర్తా దుస్తుల‌తో క్రికెట్.. ఎందుకో తెలుసా..?

మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని భోపాల్ న‌గ‌రంలో జ‌రుగుతున్న ఓ క్రికెట్ టోర్న‌మెంట్‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. సాంప్ర‌దాయ ధోతి-కుర్తా దుస్తులు ధ‌రించిన వేద‌పండితులు క్రికెట్ ఆడుతున్నారు. సంస్కృతాన్ని ప్రోత్సహించే లక్ష్యంలో భాగంగా ఈ క్రికెట్ టోర్న‌మెంట్‌ను నిర్వ‌హిస్తున్నారు. పాశ్చాత్య దేశాలకు పారమార్థిక ధ్యాన అభ్యాసాన్ని అందించిన‌ మహర్షి మహేశ్ యోగి జయంతిని పురస్కరించుకుని మహర్షి మైత్రి పేరిట ఈ క్రికెట్‌ టోర్నమెంట్ ను నిర్వ‌హిస్తున్నారు.

భోపాల్‌లోని అంకుర్ మైదానంలో శుక్ర‌వారం ఈ టోర్న‌మెంట్ ప్రారంభ‌మైంది. నాలుగు రోజుల పాటు జ‌ర‌గ‌నుంది. ఆటగాళ్లు, అంపైర్లు అనర్గళంగా సంస్కృతంలో మాట్లాడుతున్నారు. ఔట్‌లు, మిస్ ఫీల్డ్‌లు, క్యాచ్ వంటి వాటిని కూడా సంస్కృత బాష‌లోనే వివ‌రిస్తున్నారు.

Cheteshwar Pujara : సెల‌క్ట‌ర్ల‌కు పుజారా స్ట్రాంగ్ మెసేజ్‌..! ఇక ఎంపిక చేయ‌క త‌ప్ప‌దు..!

కాగా.. ఈ టోర్న‌మెంట్‌లో విజేత‌గా నిలిచిన వారిని జ‌న‌వ‌రి 22న రామాల‌య ప్ర‌తిష్టాప‌న అనంత‌రం అయోధ్య‌కు తీసుకువెళ్ల‌నున్న‌ట్లు మహర్షి మైత్రి క‌మిటీ స‌భ్యుడు అంకుర్ పాండే తెలిపారు.

అంతేకాకుండా విజేత‌ల‌కు రూ.21వేలు, ర‌న్న‌ర‌ప్‌కు రూ.11వేల న‌గ‌దు ప్రోత్స‌హ‌కాన్ని అందించ‌నున్నారు. ఇది నాలుగో ఎడిష‌న్ టోర్న‌మెంట్ అని భోపాల్‌కు చెందిన నాలుగు జ‌ట్ల‌తో క‌లిపి మొత్తం 12 జ‌ట్లు ఈ టోర్న‌మెంట్‌లో పాల్గొన్న‌ట్లు వివ‌రించారు. మ‌రో నిర్వాహ‌కుడు మాట్లాడుతూ.. వైదిక కుటుంబంలో సంస్కృతం, క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం ఈ కార్యక్రమం లక్ష్యమ‌ని చెప్పారు. బహుమతులు కాకుండా, క్రీడాకారుల‌కు వేద పుస్తకాలు, 100 సంవత్సరాల పంచాంగాన్ని అందివ‌నున్న‌ట్లు తెలిపారు.

BBL : ఏంటీ భ‌య్యా.. ఇది ఔటా..? థర్డ్ అంపైరే తప్పు చేస్తే ఇక దిక్కెవరూ..!