Afghanistan Batsman
Kabul Premier League: ఒకే ఓవర్లో ఆరు బాల్స్‌కు ఆరు సిక్స్‌లు కొట్టడం మనం చూశాం.. కానీ, ఆఫ్ఘనిస్థాన్ బ్యాట్స్‌మెన్ (Afghanistan Batsman) ఒకే ఓవర్లో ఏడు సిక్స్‌లు బాధడమే కాకుండా.. ఆ ఓవర్లో ఏకంగా 48 పరుగులు రాబట్టాడు. బౌలర్ చేతి నుంచి వేగంగా బాల్ పిచ్‌పై పడటమే ఆలస్యం.. అంతే వేగంతో వరుసగా ఆరు బాల్స్ బౌండరీ లైన్ దాటాయి. ఇంతటి స్థాయిలో విధ్వంసం సృష్టించింది ఆస్ట్రేలియా, ఇండియా బ్యాటర్ అనుకుంటున్నారా..? కాదు.. ఆఫ్ఘనిస్థాన్ బ్యాట్స్‌మెన్ సెడిఖుల్లా. అతను వరుసగా సిక్సులు బాదిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఏం కొట్టుడు కొట్టావ్ భయ్యా.. అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
IND vs WI 2nd ODI: రెండో వన్డేలో టీమిండియా ఓటమి.. కుందేలు – తాబేలు కథ చెప్పిన హార్దిక్ పాండ్య
కాబూల్ ప్రీమియర్ లీగ్‌లో ఆఫ్ఘనిస్థాన్ బ్యాట్స్‌మెన్ సెడిఖుల్లా అటల్ విధ్వంసం సృష్టించాడు. ఒకే ఓవర్లో ఏడు సిక్సులు కొట్టడమే కొట్టాడు. దీనికితోడు ఆ ఓవర్లో ఏకంగా 48 పరుగులు వచ్చాయి. ఆప్ఘనిస్థాన్‌లో టీ20 ఫార్మాట్‌లో కాబూల్ ప్రీమియర్ లీగ్ 2023 (కేపీఎల్) జరుగుతుంది. ఈ లీగ్‌లో భాగంగా అబాసిన్ ఢిఫెండర్స్, షాకీన్ హంటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో షాకీన్ హంటర్స్ కెప్టెన్ సెడిఖుల్లా తన విశ్వరూపం చూపించాడు. అతని బ్యాటింగ్ దాటికి.. అబాసిన్ డిఫెండర్స్ స్పిన్ బౌలర్ అమీర్ బజాయ్ విలవిల్లాడాడు. బాల్ ఎక్కడ వేసినా దానిని బౌండరీ లైన్ అవతలకు సెడిఖుల్లా దాటించాడు.
అబాసిస్ డిఫెండర్స్ స్పిన్ బౌలర్ అమీర్ బజాయ్ 19వ ఓవర్ వేశాడు. తొలిబాల్ నోబాల్ వేశాడు. దానిని లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ సెడిఖుల్లా సిక్స్ కొట్టాడు. ఆ తరువాత వైడ్ బాల్ ఫోర్ వచ్చింది. ఇలా ఓవర్‌లో ఒక్క బాల్‌కూడా కౌంట్ కాకుండానే 12 పరుగులు వచ్చాయి. ఆ తరువాత వేసిన ఆరు బాల్స్‌కు సెడిఖుల్లా ఆరు సిక్సులు బాదాడు. బౌలర్ అమీర్ బజాయ్ బాల్ వేయటం గాలిలోకి చూడటమే సరిపోయింది. ఈ మ్యాచ్ లో సెడిఖుల్లా కేవలం 56 బంతుల్లో ఏకంగా 118 పరుగులు చేశాడు. ఇందులో 10 సిక్సులు, ఏడు ఫోర్లు ఉన్నాయి. సెడిఖుల్లా విధ్వంసంతో షాహీన్ హంటర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ఏకంగా 213 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన అబాసిన్ డిఫెండర్స్ జట్టు 18.3 ఓవర్లలో 121 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో షాహీన్ హంటర్స్ జట్టు ఏకంగా 92 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
https://twitter.com/AFG_Sports/status/1685241662484975616?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1685241662484975616%7Ctwgr%5E49d9cdfe61e5aa91fe7dae8bb48d9f857d57dc0b%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.abplive.com%2Fsports%2Fcricket%2Fafghanistan-batter-sediqullah-atal-smashed-7-sixes-in-an-over-in-kabul-premier-league-watch-video-2463193
ఒకే ఓవర్లో ఏడు సిక్సులు కొట్టిన రికార్డు రుతురాజ్ గైక్వాడ్ పేరుపై ఉంది. విజయ్ హజారే ట్రోపీలో యూపీ తరపున ప్రాతినిధ్యం వహించిన రుతురాజ్ గైక్వాడ్ మహారాష్ట్ర బౌలర్ రుతురాజ్ శివసింగ్ వేసిన ఒకే ఓవర్లో ఏడు సిక్సులు బాదాడు. అప్పట్లో అది పెద్ద సంచలనంగా మారింది.. తాజాగా సెడిఖుల్లా ఒకే ఓవర్లో ఏడు సిక్సులు కొట్టి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.