భారత్ గడ్డపై చేసిన ప్రాక్టీస్ ఫలించినట్లుంది అఫ్గాన్ టెస్టుల్లో తొలిసారి గెలిచి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. 2018లో భారత్‌లో తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడిన అఫ్గనిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. కొత్త అధ్యాయం లిఖించాలనుకున్న అఫ్గన్ కు తొలిసారి పరాజయం ఎదురైనా రెండో టెస్టు మ్యాచ్‌లోనే విజయాన్ని దక్కించుకుని చరిత్రాత్మక విజయంతో నిలిచింది.
ఐర్లాండ్‌తో ఆడిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో రాణించిన అఫ్గాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆశ్చర్యపరిచింది. 146 పరుగులకే కట్టడి చేసిన అఫ్గన్ బౌలర్లు విజయ లక్ష్యాన్ని సునాయాసంగా రాబట్టగలిగారు. ఫలితంగా అఫ్గాన్ 7 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌పై గెలుపొందింది. రహ్మత్‌షా(76), ఇషానుల్హా (65 నాటౌట్) హాఫ్ సెంచరీలతో అలరించి అఫ్గాన్‌కు అలవోక విజయాన్ని అందించారు. రహ్మత్ షా, ఇషాను ల్హా 139 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పగలిగారు.
తొలి ఇన్నింగ్స్‌లో 98 పరుగుల వద్ద ఔటైన షా.. రెండో ఇన్నింగ్స్‌లో 76 పరుగులతో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ సొంతం చేసకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ బ్యాట్స్‌మెన్ ఆండ్రూ బాల్‌బిర్నీ(82), కెవిన్ ఒబ్రైన్(56) మెరుగైన ప్రదర్శన చేసి 288 పరుగులు చేయగలిగారు. తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లతో చెలరేగిన సంచలన స్పిన్నర్ రషీద్ ఖాన్.. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో విజృంభించి ఐర్లాండ్‌ను కట్టడి చేశాడు.
భారత్ టెస్టు విజయం సాధించడానికి 25మ్యాచ్‌ల వరకూ పట్టింది. ఆ విజయం ఇంగ్లాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో సొంతం చేసుకుంది టీమిండియా.