shaheen afridi vs babar azam
Shahid Afridi: పాకిస్థాన్ జట్టు సొంతగడ్డపై విజయాలు సాధించేందుకు ఆపసోపాలు పడుతుంది. 2022 సంవత్సరంలో ఒక్క టెస్టునూ ఆ జట్టు గెలుచుకోలేదు. ఇటీవల ఇంగ్లాండ్ చేతిలో వైట్‌వాష్‌కు గురైంది. సొంతగడ్డపై టెస్టుల్లో వరుసగా నాలుగు టెస్టుల్లో ఓడిపోవటం పాక్ చరిత్రలో ఇదే తొలిసారి. ఇంగ్లాండ్ ఇచ్చిన షాక్‌తో పాక్ క్రికెట్ బోర్డులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పీసీబీ చైర్మన్ పదవి నుంచి రమీజ్ రాజాను తప్పించిన ప్రభుత్వం.. ఆ బాధ్యతలను నమాజ్ సేథీకి అప్పగించింది.
పీసీబీ చైర్మన్‌గా సేథీ బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజుల్లోనే లెక్షన్ కమిటీ చైర్మన్ తాత్కాలిక బాధ్యతలను మాజీ పాక్ క్రికెటర్ షాహీద్ అఫ్రీదికి అప్పగించారు. నేటి నుంచి పాకిస్థాన్‌లో న్యూజీలాండ్ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. అయితే పాక్-న్యూజీలాండ్ టెస్ట్ సిరీస్ కోసం గతంలోనే పాక్ టీంను సెలక్ట్ చేశారు. అయితే, అఫ్రిదీ తాత్కాలిక సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత జట్టులో స్వల్ప మార్పులు చేశారు.
న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ కోసం ఎంపిక చేసిన పాక్ జట్టులో మిర్ హంజా, సాజిద్ ఖాన్, షాన్వాజ్ దహానీలను చేర్చాడు. ఈ ముగ్గురిలో ఫాస్ట్ బౌలర్ మిర్‌హంజాకు తుది జట్టులోనూ చోటు దక్కింది. రిటైర్ అయిన మాజీ క్రికెటర్ అజహర్ అలీ స్థానంలో ఇమామ్ ఉల్ హక్‌ను జట్టులోకి తీసుకున్నారు. బాబర్‌కు సన్నిహితుడైన వైస్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌ను తప్పించి అతడి స్థానంలో సర్ఫరాజ్ అహ్మద్ ను అఫ్రిది జట్టులోకి తీసుకున్నారు. అదేవిధంగా ఆల్ రౌండర్ ఫహీం అష్రఫ్ స్థానంలో మిర్ హంజాను జట్టులోకి తీసుకున్నారు. దీంతో నేను చెప్పినట్లే నడుచుకోవాలన్నట్లుగా పాక్ కెప్టెన్ బాబర్‌కు అఫ్రిది స్టాంగ్ హెచ్చరికలు చేసినట్లుగా ఉందని పాక్ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.