After Dream 11 Exit here is the India Jersey for Asia Cup 2025
Team India Jersey : మంగళవారం (సెప్టెంబర్ 9) యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీలో పాల్గొనేందుకు ఇప్పటికే భారత జట్టు దుబాయ్ చేరుకుంది. ఈ మెగాటోర్నీలో రాణించేందుకు టీమ్ఇండియా ఆటగాళ్లు తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టారు.
శుక్రవారం దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో భారత జట్టు తొలి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో భారత ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించారు. ముఖ్యంగా శుభ్‌మన్ గిల్, పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మధ్య నెట్స్‌లో ఆసక్తికరపోరాటం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
📍 Dubai
The preps have begun for #AsiaCup2025 😎#TeamIndia pic.twitter.com/gRVPvnfhtK
— BCCI (@BCCI) September 6, 2025
కాగా.. ఈ మెగాటోర్నీలో టీమ్ఇండియా ప్రధాన స్పాన్సర్ లేకుండానే ఆడనుంది. ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు-2025కు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో డ్రీమ్ 11తో బీసీసీఐ ఒప్పందం రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీసీసీఐ కొత్త స్పాన్సర్ కోసం టెండర్లను ఆహ్వానించింది.
ఐసీసీ అకాడమీలో భారత ఆటగాళ్లు జెర్సీ(Team India Jersey)పై స్పాన్సర్ లేకుండా ప్రాక్టీస్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆసియాకప్‌లో భారత షెడ్యూల్ ఇదే..
ఆసియాకప్ 2025లో భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను ఆతిథ్య యూఏఈతో సెప్టెంబర్ 10న ఆడనుంది. ఆ తరువాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో సెప్టెంబర్ 14న తలపడనుంది. లీగ్ దశలో తన చివరి మ్యాచ్‌ను సెప్టెంబర్ 19న ఒమన్‌తో ఆడనుంది.
Lionel Messi : సొంతగడ్డపై మెస్సీ చివరి మ్యాచ్ ఆడేశాడా? ఫిఫా ప్రపంచకప్ 2026 ఆడనట్లేనా?
ఆసియాకప్-2025కు భారత జట్టు ఇదే..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.