Ajinkya Rahane : న‌న్ను మ‌రిచిపోకండి.. నేనింకా రేసులోనే ఉన్నా.. సెల‌క్ట‌ర్ల‌కు అజింక్య ర‌హానే సందేశం!

టీమ్ఇండియా సెప్టెంబ‌ర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో స్వ‌దేశంలో రెండు టెస్టు మ్యాచుల సిరీస్ ఆడ‌నుంది.

Ajinkya Rahane slams maiden County Championship hundred for Leicestershire

Ajinkya Rahane century : టీమ్ఇండియా సెప్టెంబ‌ర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో స్వ‌దేశంలో రెండు టెస్టు మ్యాచుల సిరీస్ ఆడ‌నుంది. ఈ సిరీస్‌కు తాను రేసులో ఉన్న‌ట్లు సీనియ‌ర్ ఆట‌గాడు అజింక్య ర‌హానే సెల‌క్ట‌ర్ల‌కు సందేశం పంపాడు. ఇంగ్లాండ్‌లో జ‌రుగుతున్న కౌంటీ ఛాంపియ‌న్‌షిప్ డివిజ‌న్‌-2 మ్యాచ్‌లో శ‌త‌కంతో క‌దం తొక్కాడు. లీసెస్టర్‌షైర్ త‌రుపున బ‌రిలోకి దిగిన ర‌హానే గ్లామోర్గాన్‌తో మ్యాచ్‌లో 192 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, ఓ సిక్స్ బాది 102 ప‌రుగులు చేసి జ‌ట్టును ఓట‌మి నుంచి ర‌క్షించాడు.

ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో లీసెస్టర్‌షైర్ 251 ప‌రుగులకు ఆలౌటైంది. అనంత‌రం గ్లామోర్గాన్ 550/9 స్కోరు వద్ద మొద‌టి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. 299 ప‌రుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన లీసెస్ట‌ర్‌షేర్ 74 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఈ ద‌శ‌లో క్రీజులో అడుగుపెట్టిన ర‌హానే, పీట‌ర్ హ్యాండ్స్‌కోబ్ (139నాటౌట్‌)తో క‌లిసి జ‌ట్టును ఆదుకున్నాడు. వీరిద్ద‌రూ శ‌త‌కాల‌తో చెల‌రేగ‌డంతో ఆట చివ‌రిదైన నాలుగో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి లీసెస్టర్‌షైర్ 6 వికెట్ల న‌ష్టానికి 369 ప‌రుగుల‌తో నిలిచింది. దీంతో మ్యాచ్ డ్రా ముగిసింది.

Yuvraj Singh : ధోనిని ఎన్న‌టికి క్ష‌మించ‌ను.. యువీ కెరీర్‌ను నాశ‌నం చేశాడు.. భారత రత్న ఇవ్వాల్సిందే..

తాజా శ‌త‌కం ర‌హానే ఫ‌స్ట్‌క్లాస్ కెరీర్‌లో 40వది కావ‌డం విశేషం. రహానే 190 ఫ‌స్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 13,387 పరుగులు చేశాడు. ఇందులో 40 శ‌త‌కాలు 57 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. ఇక టీమ్ఇండియా త‌రుపున 85 టెస్టులు, 90 వ‌న్డేలు, 20 టీ20 మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో 38.5 స‌గ‌టుతో 5077 ప‌రుగులు చేశాడు. ఇందులో 12 శ‌త‌కాలు 26 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. వ‌న్డేల్లో 35.3 స‌గ‌టుతో 2962 ప‌రుగులు చేశాడు. ఇందులో మూడు శ‌త‌కాలు 24 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. ఇక టీ20ల్లో 20.8 స‌గ‌టుతో 61 ప‌రుగులు చేశాడు.

2018 నుంచి ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో ర‌హానేకు అవ‌కాశాలు రావ‌డం లేదు. ఇక టెస్టుల్లో పేల‌వ ఫామ్ కార‌ణంగా 2023లో జ‌ట్టులో చోటు కోల్పోయాడు. మ‌ళ్లీ స‌త్తా చాటి తిరిగి టెస్టు జ‌ట్టులో చోటు ద‌క్కించుకోవాల‌ని ఆరాట‌ప‌డుతున్నాడు. అయితే.. య‌శ‌స్వి జైస్వాల్‌, స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌, శుభ్‌మ‌న్ గిల్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్, ధ్రువ్ జురెల్‌ వంటి ఆట‌గాళ్లు స‌త్తాచాటుతుండ‌డంతో టీమ్ఇండియాలో ర‌హానేకు ప్లేస్ ద‌క్క‌డం చాలా క‌ష్ట‌మ‌నే చెప్పాలి.

AUS vs IND : భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా.. మైండ్ గేమ్స్ మొద‌లు.. పాపం స్టీవ్‌స్మిత్‌..

ట్రెండింగ్ వార్తలు