×
Ad

BCCI central contracts : రోహిత్, కోహ్లీకి అగార్క‌ర్ మ‌రో షాక్‌..! బీసీసీఐ సెంట్ర‌ల్ కాంట్రాక్టులో ఏ+ గ్రేడ్ తొల‌గింపు..! బికి ప‌డిపోనున్న స్టార్ ఆట‌గాళ్లు!

టీమ్ఇండియా ప్లేయ‌ర్ల‌కు బీసీసీఐ ప్ర‌తి ఏడాది సెంట్ర‌ల్ కాంట్రాక్టుల‌ను (BCCI central contracts) ఇస్తూ ఉంటుంది అన్న సంగ‌తి తెలిసిదే.

Ajit Agarkar ends Grade A+ in BCCI central contracts Reports

BCCI central contracts : టీమ్ఇండియా ప్లేయ‌ర్ల‌కు బీసీసీఐ ప్ర‌తి ఏడాది సెంట్ర‌ల్ కాంట్రాక్టుల‌ను ఇస్తూ ఉంటుంది అన్న సంగ‌తి తెలిసిదే. ప్లేయ‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న‌, అనుభ‌వం, ఎన్ని ఫార్మాట్లు ఆడ‌తారు అనే ప్రాతిప‌దిక‌న బోర్డు కాంట్రాక్టు గ్రేడ్‌ల‌ను నిర్ణ‌యిస్తుంది. ప్ర‌స్తుతం నాలుగు గ్రేడ్‌లు.. ఏ+, ఏ, బీ, సీ గ్రేడ్‌లు ఉన్నాయి. అయితే.. అజిత్ అగార్క‌ర్ నేతృత్వంలోని సెల‌క్ష‌న్ క‌మిటీ సెంట్ర‌ల్ కాంట్రాక్టుల‌లో భారీ మార్పుల‌ను సూచించింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఏ+ కేట‌గిరిని పూర్తిగా తొల‌గించాల‌ని బీసీసీఐని అగార్క‌ర్ కోరిన‌ట్లు స్పోర్ట్స్ త‌క్ తెలిపింది. త‌దుప‌రి అపెక్స్ కౌన్సిల్‌లో ఈ విష‌యమై చ‌ర్చించ‌నున్నార‌ని, బీసీసీఐ దీనికి ఆమోద‌ముద్ర వేస్తే అప్పుడు ఏ, బీ, సీ కేట‌గిరీలు మాత్ర‌మే మిగిలి ఉంటాయ‌ని పేర్కొంది.

WPL 2026 : డ‌బ్ల్యూపీఎల్‌లో ఆర్‌సీబీ జోరు.. ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన స్మృతి మంధాన సేన‌..

ప్ర‌స్తుతం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు ఏ+ కేట‌గిరీలో ఉన్నారు. వీరికి బీసీసీఐ ఏడాదికి జీతంగా 7 కోట్లు చెల్లిస్తోంది. ఇక గ్రేడ్ ఏ ఆటగాళ్లకు రూ.5 కోట్లు, గ్రేడ్ బి ఆటగాళ్లకు రూ.3 కోట్లు, గ్రేడ్ సి ఆటగాళ్లకు రూ.1 కోటి చొప్పున‌ జీతంగా బీసీసీఐ ఇస్తోంది.

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో టెస్టులు, టీ20ల‌కు వీడ్కోలు ప‌లికిన రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీలు ప్ర‌స్తుతం వ‌న్డేలు మాత్ర‌మే ఆడుతున్నారు. ఈక్ర‌మంలో వీరిని బి కేట‌గిరి మార్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. స‌వ‌రించిన గ్రేడ్‌లలో ప్లేయ‌ర్ల‌కు ఎంత మొత్తం జీతంగా చెల్లిస్తారు అన్న‌దానిపై స్ప‌ష్ట‌త లేదు.

Saina Nehwal : బ్యాడ్మింటన్‌కు సైనా నెహ్వాల్ రిటైర్‌మెంట్..

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితా (2024-25)..

గ్రేడ్ ఏ+ – రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా
గ్రేడ్ ఏ – మహ్మద్ సిరాజ్, కేఎల్‌ రాహుల్, శుభమన్ గిల్, హార్దిక్ పాండ్యా, షమీ, రిషబ్ పంత్
గ్రేడ్ బి – సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్
గ్రేడ్ సి – రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రజత్ పాటిదార్, ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శ‌ర్మ‌, ఆకాశ్ దీప్‌, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, హ‌ర్షిత్ రాణా.