IND vs ENG 4th test : రాంచీ టెస్టు.. క్లీన్‌బౌల్డ్ అయినా నాటౌట్‌గా జాక్ క్రాలే.. ఏంటి సామీ ఇది

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రాంచీ వేదిక‌గా భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్లు నాలుగో టెస్టు మ్యాచ్‌లో త‌ల‌ప‌డుతున్నాయి.

Akash Deep CLEAN Bowls Zak Crawley Of A NO-BALL During 4th Test At Ranchi

India vs England : ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రాంచీ వేదిక‌గా భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్లు నాలుగో టెస్టు మ్యాచ్‌లో త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సిరీస్‌లో 1-2 తేడాతో వెనుక‌బ‌డి ఉన్న ఇంగ్లాండ్‌కు ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డం ఎంతో అవ‌స‌రం. రాంచీ పిచ్ మొద‌టి రోజు బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో స్టోక్స్ మ‌రో ఆలోచ‌న లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఈ మ్యాచ్‌కు భార‌త స్టార్ పేస‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వ‌డంతో ఆకాశ్‌దీప్ టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు. అయితే.. అత‌డిని దుర‌దృష్టం వెంటాడింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవ‌ర్‌ను ఆకాశ్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని ఐదో బంతికి ఇంగ్లాండ్ ఓపెన‌ర్ జాక్ క్రాలేను క్లీన్‌బౌల్డ్ చేశాడు. టెస్టుల్లో ఇది అత‌డికి తొలి వికెట్ కావ‌డంతో సెల‌బ్రేష‌న్స్‌లో మునిగిపోయాడు. అయితే.. అది నోబాల్ కావ‌డంతో క్రాలే బ‌తికిపోయాడు. దీంతో ఆకాశ్ దీప్ కాస్త నిరాశ చెందాడు.

Delhi Capitals : ఇది గ‌మ‌నించారా? ఢిల్లీ మ్యాచులు విశాఖ‌లో ? పంత్ మెరుపులు చూడొచ్చు!

ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు..
తొలి వికెట్ తృటిలో మిస్ అయినప్ప‌టికి కూడా వికెట్ల కోసం ఎక్కువ సేపు నిరీక్షించే అవ‌కాశం ఆకాశ్‌దీప్‌కు అవ‌స‌రం లేకుండా పోయింది. ఈ సారి ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇన్నింగ్స్ ప‌దో ఓవ‌ర్‌ను వేసిన ఆకాశ్.. రెండో బంతికి బెన్‌డ‌కెట్ (11), నాలుగో బంతికి ఒలీపోప్ (0) ల‌ను ఔట్ చేశాడు. దీంతో ఆకాశ్ సంబ‌రాలు అంబ‌రాన్ని అంటాయి.

క్రాలేను వ‌ద‌ల‌లేదు..

నోబాల్ కావడంతో క్లీన్‌బౌల్డ్ అయినా కానీ బ‌తికిపోయిన జాక్‌క్రాలేను చివ‌రికి ఆకాశ్‌దీపే ఔట్ చేశాడు. 11.5వ ఓవ‌ర్‌లో జాక్‌క్రాలే(42; 42 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్‌)ను ఔట్ చేశాడు. ఈ సారి కూడా అత‌డిని క్లీన్‌బౌల్డ్ చేయ‌డం విశేషం. ప్ర‌స్తుతం ఇంగ్లాండ్ స్కోరు 12 ఓవ‌ర్ల‌కు 57/3. జానీ బెయిర్ స్టో (0), జో రూట్ (2)లు క్రీజులో ఉన్నారు.

European T10 cricket : టీ10 క్రికెట్‌లో ప్ర‌పంచ రికార్డు.. 21 బంతుల్లోనే సెంచ‌రీ..

ట్రెండింగ్ వార్తలు