Delhi Capitals : ఇది గ‌మ‌నించారా? ఢిల్లీ మ్యాచులు విశాఖ‌లో ? పంత్ మెరుపులు చూడొచ్చు!

ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2024 సీజ‌న్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ప్ర‌క‌టించింది.

Delhi Capitals : ఇది గ‌మ‌నించారా? ఢిల్లీ మ్యాచులు విశాఖ‌లో ? పంత్ మెరుపులు చూడొచ్చు!

Why Delhi Capitals are playing their home games in Vizag

Delhi Capitals – IPL 2024 : ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2024 సీజ‌న్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ప్ర‌క‌టించింది. దేశంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో 21 మ్యాచుల‌కు సంబంధించిన షెడ్యూల్‌నే బీసీసీఐ విడుద‌ల చేసింది. అన్ని జ‌ట్లు కూడా త‌మ హోం మ్యాచుల‌ను సొంత మైదానంలో ఆడ‌నుండ‌గా ఒక్క ఢిల్లీ క్యాపిట‌ల్స్ మాత్ర‌మే విశాఖ‌లో ఆడ‌నుంది. ఈ షెడ్యూల్ ప్ర‌కారం రెండు మ్యాచులు విశాఖ‌లో జ‌ర‌గ‌నున్నాయి.

దీంతో క్రికెట్ అభిమానులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం డీసీ హోం గ్రౌండ్ అన్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఈ సీజ‌న్‌కు ఢిల్లీ హోం గ్రౌండ్ మారిందా అనే అనుమానాలు మొదల‌య్యాయి. అయితే.. అరుణ్ జైట్లీ మైదానం కాకుండా విశాఖ మైదానాన్ని ఢిల్లీ జ‌ట్టు హోం గ్రౌండ్ ఎంచుకోవ‌డానికి ఓ కార‌ణం ఉంది.

అస‌లు రీజ‌న్ ఇదే..

మ‌హిళల ప్రీమియ‌ర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్‌) 2024 సీజ‌న్ ఫిబ్ర‌వ‌రి 23 నుంచి మార్చి 17 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. ఈ లీగ్‌లో ఫిబ్ర‌వ‌రి 23 నుంచి మార్చి 4 దాకా జ‌రిగే మ్యాచ్‌లు బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా జ‌ర‌గ‌నుండ‌గా ఆ త‌రువాత మార్చి 5 నుంచి 17 వ‌ర‌కు జ‌రిగే మ్యాచ్‌ల‌కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం ఆతిథ్యం ఇవ్వ‌నుంది. లీగ్ ద‌శ‌తో పాటు ప్లే ఆఫ్స్‌, ఫైన‌ల్ మ్యాచ్ లు అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జ‌ర‌గ‌నున్నాయి.

SRH : హైద‌రాబాద్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఉప్ప‌ల్‌లో ఎన్ని మ్యాచులో తెలుసా?

ఇలా వ‌రుస మ్యాచ్‌ల కార‌ణంగా అక్క‌డ పిచ్ దెబ్బ‌తినే అవ‌కాశం ఉంద‌ని, వెంట‌నే పురుషుల ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించ‌డం క‌ష్ట‌మని బీసీసీఐకి డీడీసీఏ తెలియ‌జేసింది. ఈ క్ర‌మంలో ఢిల్లీ హోం మ్యాచ్‌ల‌ను విశాఖ‌కు త‌ర‌లించారు. ఈ సీజ‌న్‌లో ఢిల్లీ హోం గ్రౌండ్ లో ఏడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే.. కేవ‌లం రెండు మ్యాచ్‌ల‌ను మాత్ర‌మే విశాఖ‌లో ఆడ‌నుంది. మిగిలిన మ్యాచ్‌లు అరుణ్‌జైట్లీ స్టేడియంలోనే జ‌ర‌గ‌నున్నట్లు బీసీసీఐ అధికారి ఒక‌రు వెల్ల‌డించిన‌ట్లు పీటీఐ తెలిపింది.

విశాఖ‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ మార్చి 31న చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో, ఏప్రిల్ 3న కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఇక రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన పంత్ ఈ ఐపీఎల్ సీజ‌న్‌తోనే రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నాడ‌నే వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అదే గ‌నుక నిజ‌మైతే పంత్ మెరుపుల‌ను విశాఖ వాసులు ప్ర‌త్య‌క్షంగా చూసే అవ‌కాశం ఉంది.

European T10 cricket : టీ10 క్రికెట్‌లో ప్ర‌పంచ రికార్డు.. 21 బంతుల్లోనే సెంచ‌రీ..