European T10 cricket : టీ10 క్రికెట్‌లో ప్ర‌పంచ రికార్డు.. 21 బంతుల్లోనే సెంచ‌రీ..

యూరోపియన్ క్రికెట్ సిరీస్ (ఈసీఎస్) టీ10 క్రికెట్‌లో పెను సంచ‌ల‌నం న‌మోదైంది.

European T10 cricket : టీ10 క్రికెట్‌లో ప్ర‌పంచ రికార్డు.. 21 బంతుల్లోనే సెంచ‌రీ..

Spanish cricketer Asjad Butt slams 21 ball century in European T10 cricket

ECS : యూరోపియన్ క్రికెట్ సిరీస్ (ఈసీఎస్) టీ10 క్రికెట్‌లో పెను సంచ‌ల‌నం న‌మోదైంది. కేవ‌లం 21 బంతుల్లోనే సెంచ‌రీ బాది స్పానిష్ క్రికెట‌ర్ అస్జద్ బట్ చ‌రిత్ర సృష్టించాడు. ఫిబ్రవరి 21న కాటలున్యా డ్రాగన్స్, సోహల్ హాస్పిటల్‌లెట్ మధ్య జరిగిన 86వ టీ10 మ్యాచ్‌లో బ‌ట్ ఈ ఘ‌న‌త సాధించాడు.

ఈ లీగ్‌లో అస్జద్ బట్.. సోహల్ హాస్పిటల్‌లెట్ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. టోర్నీలో భాగంగా బుధ‌వారం కాటలున్యా డ్రాగన్స్, సోహల్ హాస్పిటల్‌లెట్ లు త‌ల‌ప‌డ్డాయి. మొద‌ట బ్యాటింగ్ చేసిన‌ టలున్యా డ్రాగన్స్ నిర్ణీత 10 ఓవ‌ర్ల‌లో 155 ప‌రుగులు చేసింది. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌కు సోహల్ హాస్పిటల్‌లెట్ దిగింది. అస్జద్ బట్ 27 బంతుల్లో 18 సిక్స‌ర్లు, 4 ఫోర్లు సాయంతో 128 ప‌రుగులు చేయ‌డంతో హాస్పిట‌లెట్ జ‌ట్టు ల‌క్ష్యాన్ని 5.3 ఓవ‌ర్ల‌లోనే ఛేదించింది.

IPL 2024 Schedule : ఐపీఎల్ షెడ్యూల్ వ‌చ్చేసింది.. మార్చి 22న చెన్నై వ‌ర్సెస్ ఆర్‌సీబీ

అస్జద్ బట్ కేవ‌లం 21 బంతుల్లోనే సెంచ‌రీ చేశాడు. ఈ క్ర‌మంలో ఈ లీగ్‌లో వేగ‌వంత‌మైన సెంచ‌రీ చేసిన బ్యాట‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు. గ‌తంలో ఈ రికార్డు మార్స్టా సీసీ ఓపెనర్ షేర్ అలీ పేరిట ఉంది. జూన్ 2023లో షేర్ అలీ 25 బంతుల్లోనే సెంచ‌రీ చేయ‌గా.. తాజ‌గా బ‌ట్ బ్రేక్ చేశాడు. ఇందులో విశేషం ఏమిటంటే.. బట్ తన ఇన్నింగ్స్‌ను 474 స్ట్రైక్ రేట్ తో ఆడాడు.

కాగా.. అస్జద్ బట్ సెంచ‌రీ వీడియోను యూరోపియన్ క్రికెట్ త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.