Akashdeep and his family added a new car to his family
ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్ సిరీస్‌లో టీమ్ఇండియా పేసర్ ఆకాశ్ దీప్ అదరగొట్టాడు. ముఖ్యంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో 10 వికెట్లు తీసి టీమ్ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఐదో టెస్టు మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో నైట్ వాచ్‌మన్‌గా వచ్చి 66 పరుగులు చేసి జట్టు భారీ స్కోరుకు సాయం చేశాడు. కాగా.. ఆకాశ్‌దీప్ కొత్త కారును కొనుగోలు చేశాడు.
ఈ విషయాన్ని స్వయంగా అతడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. షోరూమ్‌లో కారును డెలివరీ తీసుకుంటున్న ఫోటోలను షేర్ చేస్తూ కల నెరవేరింది అంటూ రాసుకొచ్చాడు. క్యాన్సర్‌తో పోరాడుతున్న అతని సోదరి అఖండ్ జ్యోతి సింగ్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు కారు వేడుకలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Viral Cricket Videos : ఏంటి మామ ఇదీ.. ఔటా? నాటౌటా? చెబితే మీరు తోపులే..
ఆకాశ్ దీప్ టయోటా ఫార్చ్యూనర్ కారును కొనుగోలు చేశాడు. దీని ప్రారంభ ధర రూ.36.05 లక్షలు ఉండగా టాప్ మోడల్ ధర రూ.52.34 వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది
ఆకాశ్ దీప్ ఇప్పటి వరకు భారత్ తరుపున 10 టెస్టులు ఆడాడు. 28 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ సారి ఐదు వికెట్ల ప్రదర్శన, మరోసారి నాలుగు వికెట్ల ప్రదర్శనను నమోదు చేశాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్ ద్వారా టెస్టుల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో అతడిని లక్నో సూపర్ జెయింట్స్ రూ.8కోట్ల మొత్తానికి సొంతం చేసుకుంది. మొత్తంగా ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌లు ఆడి 10 వికెట్లు తీశాడు.