ప్రాక్టీస్‌లో సన్‌రైజర్స్ ఆటగాళ్లు (Photo: @SunRisers Hyderabad)
SRH vs LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో భాగంగా శనివారం ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants)తో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) తలపడనుంది. ప్లే ఆఫ్స్ బరిలో నిలవాలంటే అటు లక్నో గానీ, ఇటు సన్‌రైజర్స్ గాని తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ క్రమంలో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న లక్నో, సన్‌రైజర్స్ జట్లు ప్రాక్టీస్‌ను మొదలుపెట్టేశాయి. మ్యాచ్‌లో గెలిచేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.
ఈ సీజన్‌లో లక్నో ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడగా ఐదు మ్యాచుల్లో విజయం సాధించింది. మరో ఐదు మ్యాచుల్లో ఓడగా ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో 11 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. అటు సన్‌రైజర్స్ 10 మ్యాచులు ఆడగా నాలుగు మ్యాచుల్లో గెలిచి 8 పాయింట్లతో పట్టికలో ఆఖరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది.
IPL 2023, RR vs SRH: రాజస్థాన్ కొంపముంచిన నోబాల్.. ఉత్కంఠ పోరులో హైదరాబాద్ విజయం
ఇక రేపటి మ్యాచ్ కోసం శుక్రవారం ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలో తీవ్రంగా సాధన చేశారు. నెట్స్‌ల్లో చెమటోడ్చారు. ముఖ్యంగా హైదరాబాద్ ఆటగాళ్లు మంచి జోష్‌లో ఉన్నారు. గత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో హైడ్రామా మధ్య ఆఖరి బంతికి విజయం సాధించడం ఆ జట్టులో జోష్ నింపింది. అదే ఆటతీరును రేపటి మ్యాచ్‌లో కొనసాగించాలని సన్‌రైజర్స్ భావిస్తోంది.
Eyeing the toe & the W ?? pic.twitter.com/1c9NG3ksh8
— SunRisers Hyderabad (@SunRisers) May 12, 2023
మ్యాచ్‌కు ఏర్పాట్లు పూర్తి
ఈ మ్యాచ్‌ను సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నాం మూడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. బ్లాక్ టికెట్లపై పోలీసులు గట్టి నిఘా ఉంచారు. మ్యాచ్ జరిగే సమయంలో పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
Yashasvi Jaiswal : జైశ్వాల్ సెంచరీ కాకుండా కోల్‌కతా స్పిన్నర్ ప్రయత్నం.. నెటిజన్ల మండిపాటు