Yashasvi Jaiswal : జైశ్వాల్‌ సెంచరీ కాకుండా కోల్‌క‌తా స్పిన్న‌ర్ ప్ర‌య‌త్నం.. నెటిజ‌న్ల మండిపాటు

కోల్‌క‌తా స్పిన్నర్ సుయాశ్ శ‌ర్మ పై నెటీజ‌న్లు మండిప‌డుతున్నారు. య‌శ‌స్వి సెంచ‌రీ చేయ‌కుండా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశాడ‌ని ఆరోపిస్తున్నారు.

Yashasvi Jaiswal : జైశ్వాల్‌ సెంచరీ కాకుండా కోల్‌క‌తా స్పిన్న‌ర్ ప్ర‌య‌త్నం.. నెటిజ‌న్ల మండిపాటు

Suyash Sharma-Yashasvi Jaiswal

Yashasvi Jaiswal- Suyash Sharma: య‌శ‌స్వి జైశ్వాల్‌.. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో, క్రికెట్ వ‌ర్గాల్లో మారుమోగుతున్న పేరు. ఐపీఎల్(IPL) 2023 సీజ‌న్‌లో భీక‌ర ఫామ్‌లో ఉన్న ఈ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (Rajasthan Royals) ఆట‌గాడు గురువారం కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌ (Kolkata Knight Riders)తో జ‌రిగిన మ్యాచ్‌లో పెను విధ్వంస‌మే సృష్టించాడు. కేవ‌లం 13 బంతుల్లో 50 ప‌రుగుల మార్క్‌ను అందుకుని ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ చ‌రిత్ర‌లో అత్యంత వేగ‌వంత‌మైన అర్ధ‌శ‌త‌కాన్ని న‌మోదు చేశాడు.

అత‌డి దూకుడు చూస్తుంటే ఈ సీజ‌న్‌లో రెండో శ‌త‌కాన్ని అందుకునేలా క‌నిపించాడు. అయితే.. తృటిలో సెంచ‌రీ మిస్ అయ్యాడు. 98 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో రాజ‌స్థాన్ ఆట‌గాళ్ల‌తో పాటు అభిమానులు కాస్త నిరుత్సాహానికి గురి అయ్యారు. ఇదిలా ఉంటే.. కోల్‌క‌తా స్పిన్నర్ సుయాశ్ శ‌ర్మ పై నెటీజ‌న్లు మండిప‌డుతున్నారు. య‌శ‌స్వి సెంచ‌రీ చేయ‌కుండా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశాడ‌ని ఆరోపిస్తున్నారు.

Yashasvi Jaiswal: బట్లర్ రనౌట్ పై యశస్వి జైశ్వాల్ ఏమన్నాడో తెలుసా..!

ఏం జ‌రిగిందంటే..?

13వ ఓవ‌ర్‌ను సుయాశ్ శ‌ర్మ వేశాడు. ఈ ఓవ‌ర్ ఆఖ‌రి బంతి వేసే స‌మయానికి జైశ్వాల్‌ 94 ప‌రుగుల వ‌ద్ద ఉన్నాడు. సంజు శాంస‌న్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్నాడు. రాజ‌స్థాన్ విజ‌యానికి 3 ప‌రుగులు కావాలి. ఆఖ‌రి బంతిని సుయాశ్ వైడ్ వేసేందుకు ప్ర‌య‌త్నించాడు. ఆ బంతి కీప‌ర్ కు కూడా అంద‌కుండా బౌండ‌రీకి వెళ్లే అవ‌కాశం ఉంది. దీన్ని ప‌సిగ‌ట్టిన సంజు శాంస‌న్ బంతిని ఎదుర్కొని ప‌రుగు కూడా తీయ‌లేదు. త‌రువాత య‌శ‌స్వి వైపు చూస్తూ సిక్స్ బాదు అన్న‌ట్లుగా సెగ చేశాడు.

ఆ త‌రువాతి ఓవ‌ర్‌ను శార్దూల్ ఠాకూర్ వేశాడు. తొలి బంతిని వైడ్ యార్క‌ర్ వేసే ప్ర‌య‌త్నం చేయ‌గా జైశ్వాల్‌ బౌండ‌రీకి త‌ర‌లించడంతో రాజ‌స్థాన్ విజ‌యాన్ని అందుకుంది. జైస్వాల్ 98 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచిపోయాడు.

Jos Buttler : ఆర్ఆర్ బ్యాటర్ జోస్ బట్లర్ కు జరిమానా.. మ్యాచ్ ఫీజులో కోత

ఆకాశ్ చోప్రా తీవ్ర అస‌హ‌నం

సుయాశ్ శ‌ర్మ చేసిన ప్ర‌య‌త్నంపై భార‌త మాజీ క్రికెట‌ర్ ఆకాశ్ చోప్రా తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. ఇది చాలా చెడు ఆలోచ‌న‌ని అన్నాడు. ఒక్క‌సారి ఊహించుకోండి ఒక‌వేళ విరాట్ కోహ్లీ సెంచరీని అడ్డుకునేందుకు పాకిస్తానీ బౌల‌ర్ ఇలా చేసి ఉంటే ఎలా ఉంటుంది..? అని ప్ర‌శ్నించాడు. కొంద‌రు కావాల‌ని అలా చేయ‌లేద‌ని చెప్పిన‌ప్ప‌టికి, ఆ బౌలర్ నిమిషాల్లో ట్రెండింగ్‌లో ఉండేలా చూస్తార‌న్నారు. ట్రోలింగ్ కూడా మామూలుగా ఉండ‌ద‌ని చెప్పాడు.

ఇక మ్యాచ్ అనంతరం జైస్వాల్ మాట్లాడుతూ.. ఆ స‌మ‌యంలో శ‌త‌కం బాదాల‌న్న ఆలోచ‌న త‌న మ‌న‌సులో లేద‌ని, జ‌ట్టు నెట్‌ర‌న్‌రేట్ పెంచాల‌న్న సంక‌ల్పం మాత్ర‌మే ఉంద‌న్నాడు. సంజు శాంస‌న్‌, నేను క‌లిసి వీలైనంత తొంద‌ర‌గా మ్యాచ్ ముగించాల‌ని బావించిన‌ట్లు జైశ్వాల్‌ చెప్పాడు.

IPL 2023, KKR vs RR: దంచికొట్టిన జైస్వాల్‌.. కోల్‌క‌తాపై రాజ‌స్థాన్ ఘ‌న విజ‌యం

కోల్‌క‌తా పై విజయంతో ఆర్ఆర్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.