IPL 2023, RR vs SRH: రాజ‌స్థాన్ కొంప‌ముంచిన నోబాల్‌.. ఉత్కంఠ పోరులో హైదరాబాద్ విజ‌యం

జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్(Rajasthan Royals) జ‌రిగిన ఉత్కంఠ పోరులో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌(Sunrisers Hyderabad) విజ‌యం సాధించింది.

IPL 2023, RR vs SRH: రాజ‌స్థాన్ కొంప‌ముంచిన నోబాల్‌.. ఉత్కంఠ పోరులో హైదరాబాద్ విజ‌యం

Sunrisers Hyderabad win

IPL 2023, RR vs SRH: జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్(Rajasthan Royals) తో జ‌రిగిన ఉత్కంఠ పోరులో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌(Sunrisers Hyderabad) విజ‌యం సాధించింది. రాజ‌స్థాన్ నిర్దేశించిన 215 ప‌రుగుల ల‌క్ష్యాన్ని స‌న్‌రైజ‌ర్స్ ఆరు వికెట్ల కోల్పోయి ఆఖ‌రి బంతికి ఛేదించింది. స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్ల‌లో అభిషేక్ శ‌ర్మ‌ (55; 34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) అర్ధ‌శత‌కంతో ఆక‌ట్టుకోగా రాహుల్ త్రిపాఠి(47; 29 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), అన్మోల్‌ప్రీత్ సింగ్(33), హెన్రిచ్ క్లాసెన్(26) గ్లెన్ ఫిలిప్స్( 25) లు రాణించారు. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో చాహ‌ల్ నాలుగు వికెట్లు తీయ‌గా, ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, కుల్‌దీప్ యాద‌వ్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

కొంప‌ముంచిన నోబాల్‌

ఆఖ‌రి ఓవ‌ర్‌లో స‌న్‌రైజ‌ర్స్ విజ‌యానికి 17 ప‌రుగులు అవ‌స‌రం కాగా.. సందీప్ శ‌ర్మ ఈ ఓవ‌ర్‌ను వేశాడు. క్రీజులో అబ్దుల్ స‌మ‌ద్‌(17నాటౌట్‌; 7 బంతుల్లో 2 సిక్స‌ర్లు), మార్కో జాన్సెన్(3 నాటౌట్‌) ఉన్నారు. తొలి బంతికి స‌మ‌ద్ రెండు ప‌రుగులు తీయ‌గా రెండో బంతికి సిక్స్ కొట్టాడు. మూడో బంతికి రెండు ప‌రుగులు తీసిన స‌మ‌ద్ నాలుగో బంతికి సింగిల్ తీయ‌గా ఐదో బంతికి జాన్స‌న్ సింగిల్ తీశాడు. స‌న్‌రైజ‌ర్స్ గెల‌వాలంటే ఆఖ‌రి బంతికి ఐదు ప‌రుగులు కావాలి. ఈ బంతికి ప‌రుగులు ఏమీ రాక‌పోవ‌డంతో రాజ‌స్థాన్ గెలుపు సంబ‌రాలు మొద‌లుపెట్ట‌గా థ‌ర్డ్ అంపైర్ నోబాల్ ఇచ్చాడు. దీంతో చివ‌రి బంతికి 4 ప‌రుగులు అవ‌స‌రం కాగా.. వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకున్న స‌మ‌ద్ ఈ సారి సిక్స్ కొట్ట‌డంతో స‌న్‌రైజ‌ర్స్ విజ‌యం సాధించింది.

IPL 2023, RR vs SRH: ఉత్కంఠ పోరులో రాజ‌స్థాన్ పై స‌న్‌రైజ‌ర్స్ విజ‌యం

అంత‌క‌ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన‌ రాజ‌స్థాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్ల న‌ష్టానికి 214 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ జోస్ బ‌ట్ల‌ర్(95; 59 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) వీర‌విహారం చేయ‌గా సంజు శాంస‌న్‌(66 నాటౌట్; 38 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), య‌శ‌స్వి జైస్వాల్‌(35; 18 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) లు దూకుడుగా ఆడారు. స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, మార్కో జాన్సెన్ లు చెరో వికెట్ తీశారు.

తృటిలో శ‌త‌కం మిస్‌

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజ‌స్థాన్‌కు ఓపెన‌ర్లు బ‌ట్ల‌ర్‌, జైస్వాల్ లు శుభారంభం ఇచ్చారు. బ‌ట్ల‌ర్ నిదానంగా ఆడగా జైస్వాల్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. జైస్వాల్ దూకుడు కొన‌సాగించ‌డంతో 4.5 ఓవ‌ర్ల‌లో రాజ‌స్థాన్ 54 ప‌రుగులు చేసింది. జైస్వాల్ దూకుడుకు న‌ట‌రాజ‌న్ అడ్డుక‌ట్ట వేశాడు. వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన సంజు శాంస‌న్ ధాటిగా ఆడుతూ స్కోరు వేగం ప‌డిపోకుండా చూశాడు.

Rohit Sharma: రోహిత్.. నీ పేరును ‘నో హిట్ శ‌ర్మ’ గా మార్చుకో.. కృష్ణమాచారి శ్రీకాంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తొలి 20 బంతుల్లో 20 ప‌రుగులే చేసిన బ‌ట్ల‌ర్.. మ‌యాంక్ మార్కండే వేసిన తొమ్మిదో ఓవ‌ర్ ఆఖ‌రి బంతికి సిక్స్ కొట్టి ట‌చ్‌లోకి వ‌చ్చాడు. ఇక అక్క‌డి నుంచి బ‌ట్ల‌ర్ షో మొద‌లైంది. హైద‌రాబాద్ బౌల‌ర్ల‌ను ఓ ఆట ఆడుకున్నాడు. బౌండ‌రీలు, సిక్స‌ర్లు బాదుతూ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. బ‌ట్ల‌ర్ జోరు అందుకోవ‌డంతో శాంస‌న్ ఎక్కువగా బ‌ట్ల‌ర్‌కు స్ట్రైక్ రొటేట్ చేశాడు.

మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 32 బంతుల్లో బ‌ట్ల‌ర్ హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. అర్ధ‌శ‌త‌కం అనంత‌రం బ‌ట్ల‌ర్ మ‌రింత వేగంగా ఆడాడు. మ‌రో వైపు ఆరంభంలో వేగంగా ఆడి త‌రువాత స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఆడ‌పాద‌డ‌పా బౌండ‌రీలు కొట్టిన శాంస‌న్‌ 33 బంతుల్లో అర్ధ‌శ‌త‌కాన్ని అందుకున్నాడు. కాగా.. శ‌త‌కానికి ఐదు ప‌రుగుల దూరంలో 19వ ఓవ‌ర్‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ బౌలింగ్‌లో బ‌ట్ల‌ర్ ఎల్భీడ‌బ్ల్యూ గా ఔట్ అయ్యాడు. బ‌ట్ల‌ర్‌, శాంస‌న్ జోడి రెండో వికెట్‌కు 138 ప‌రుగులు జోడించారు. ఆఖ‌రి ఓవ‌ర్‌లో ఓ సిక్స్‌, రెండు ఫోర్లు కొట్టిన శాంస‌న్ రాజ‌స్థాన్‌కు భారీ స్కోరు అందించాడు.