IPL Mega Auction 2025 : అఫ్గానిస్థాన్ యువ స్పిన్నర్ పై కోట్ల వ‌ర్షం.. 18 ఏళ్ల చిన్నోడికి రూ.4.8 కోట్లు

అఫ్గానిస్థాన్ యువ స్పిన్న‌ర్ అల్లా గజన్‌ఫర్ పై కోట్ల వ‌ర్షం కురిసింది

Allah Ghazanfar Who Went For Rs 4 Crore 80 lacks To Mumbai Indians In IPL 2025 Auction

అఫ్గానిస్థాన్ యువ స్పిన్న‌ర్ అల్లా గజన్‌ఫర్ పై కోట్ల వ‌ర్షం కురిసింది. ఐపీఎల్ మెగా వేలం 2025లో అత‌డిని ద‌క్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ ప‌డ్డాయి. రూ.75 ల‌క్ష‌ల క‌నీసం ధ‌ర‌తో వేలంలోకి వ‌చ్చిన అత‌డిని రూ.4.8 కోట్లకు ముంబై ఇండియ‌న్స్ కొనుగోలు చేసింది.

గ‌జ‌న్ ఫ‌ర్ కోసం మొద‌ట కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ బిడ్ వేసింది. ఆ త‌రువాత బెంగ‌ళూరు, ముంబైలు ఎంట్రీ ఇచ్చాయి. దీంతో అత‌డి ధ‌ర అమాంతం పెరుగుకుంటూ పోయింది. ఆఖ‌రికి ఆర్‌సీబీ, కోల్‌క‌తా రేసు నుంచి త‌ప్పుకోగా భారీ మొత్తానికి ముంబై అత‌డిని ద‌క్కించుకుంది.

IPL Mega Auction 2025 : పాపం కేన్ విలియ‌మ్స‌న్‌.. కేన్ మామ‌తో పాటు టీమ్ఇండియా స్టార్ల‌ను ప‌ట్టించుకోని ఫ్రాంచైజీలు

కాగా.. ఐపీఎల్ 2023, 2024 వేలంలో అత‌డిని ఏ ప్రాంఛైజీ కొనుగోలు చేయ‌లేదు. అయితే.. ఐపీఎల్ 2024 సీజ‌న్‌లో అఫ్గాన్ స్టార్ స్పిన్న‌ర్ ముజీబ్ గాయంతో త‌ప్పుకోవ‌డంతో అత‌డి స్థానంలో రూ.20 ల‌క్ష‌ల ధ‌ర‌తో గ‌జ‌న్ ఫ‌ర్‌ను కేకేఆర్ తీసుకుంది. అయితే.. ఆ సీజ‌న్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ అత‌డు బ‌రిలోకి దిగే అవ‌కాశం రాలేదు.

ఈ ఏడాది ఆరంభంలో వన్డే క్రికెట్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. బంగ్లాదేశ్‌తో గ‌త నెల‌లో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌లో ఏకంగా 6 వికెట్లు తీసి త‌న స‌త్తా ఏంటో ప్ర‌పంచానికి చాటి చెప్పాడు. ఎమ‌ర్జింగ్ టీమ్స్ ఆసియా క‌ప్‌లోనూ రాణించాడు. దీంతో ఐపీఎల్ 2025 వేలంలో అత‌డిని ద‌క్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీప‌డ్డాయి.

Bhuvaneshwar Kumar : భువ‌నేశ్వ‌ర్ కుమార్‌కు జాక్ పాట్‌.. షాక్‌లో ఆరెంజ్ ఆర్మీ..