IPL Mega Auction 2025 : పాపం కేన్ విలియమ్సన్.. కేన్ మామతో పాటు టీమ్ఇండియా స్టార్లను పట్టించుకోని ఫ్రాంచైజీలు
ఐపీఎల్ మెగా వేలం ఆసక్తికరంగా సాగుతోంది.

IPL Mega Auction 2025 Star players like kane williamson ajinkya rahane prithvi shaw unsold
ఐపీఎల్ మెగా వేలం ఆసక్తికరంగా సాగుతోంది. పలువురు ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి. అయితే.. కొందరు స్టార్ క్రికెటర్ల వైపు మాత్రం కన్నెత్తికూడా చూడడం లేదు. వీరిలో టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు అజింక్యా రహానే, పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, శ్రీకర్ భరత్, శార్దూల్ ఠాకూర్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. వీరితో పాటు విదేశీ ఆటగాళ్లలో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ కూడా అమ్ముడు పోలేదు.
ఎంతో కాలంగా అతడిని అట్టిపెట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ సహా ఏ టీమ్ కూడా అతడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. ఐపీఎల్‌లో కేన్ మామ ఇప్పటి వరకు 79 మ్యాచులు ఆడాడు. 35.47 సగటు, 125.62 స్ట్రైక్‌రేటుతో 2128 పరుగులు చేశాడు. ఇందులో 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
Bhuvaneshwar Kumar : భువనేశ్వర్ కుమార్‌కు జాక్ పాట్.. షాక్‌లో ఆరెంజ్ ఆర్మీ..
కేవలం రెండు మ్యాచులే ఆడాడు. గాయం వల్ల సీజన్ నుంచి అర్థాంతరంగా తప్పుకున్నాడు. కేన్ తో పాటు గ్లెన్ ఫిలిప్స్, కేశవ్ మహరాజ్, మోయిన్ అలీ, వంటి ఆటగాళ్లను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. కనీసం రెండో రౌండ్‌లో అయినా వీరిని ఫ్రాంచైజీలు కరునిస్తాయో లేదో చూడాలి.
🚨 PRITHVI SHAW UNSOLD. 🚨 pic.twitter.com/eOFKYYrOYl
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 25, 2024