ఐపీఎల్ లో తనకిది మొదటి మ్యాచ్. కానీ, తడబాటు లేదు. ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ను వణికించేశాడు. సన్‌రైజర్స్ వరుస విజయాలకు బ్రేక్ వేస్తూ.. అత్పల్ప స్కోరుకే ముంబైను కట్టడి చేసింది. ఈ విజయంలో ముంబై బౌలర్ దే కీలక పాత్ర. అరంగ్రేట మ్యాచ్‌లోనే సంచలనం సృష్టించిన అల్జెరీ జోసెఫ్ పై ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురుస్తున్నాయి. 2019 ఐపీఎల్ సీజన్‌లో జరిగిన అత్యుత్తమ ప్రదర్శనల్లో ఇదొకటి.
మ్యాచ్‌లో తాను వేసిన 3.4ఓవర్లలో కేవలం 12 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అత్యల్ప టార్గెట్ ను సన్‌రైజర్స్ సునాయాసంగా చేధిస్తారని భావించిన అభిమానులకు షాక్ ఇచ్చినట్లు అయింది. తొలి బంతికే ఓపెనర్ డేవిడ్ వార్నర్(15) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత జోసెఫ్ వరుస ఓవర్లలో విజయ్ శంకర్(5), హుడా(20), రషీద్ ఖాన్(0), భువనేశ్వర్(2), కౌల్(0)లు పెవిలియన్‌కు చేరారు.
జోసెఫ్(6/12)తో పాటు మరో యువ స్పిన్నర్ రాహుల్ చాహర్(2/21) కూడా రాణించడంతో 40 పరుగుల తేడాతో ఘోరంగా పరాజయాన్ని చవిచూసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. మాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అల్జెరీ జోసెఫ్ అందుకున్నాడు. ‘తొలి వికెట్ తీసినప్పుడు సంబరాలు చేసుకోవాలనుకోలేదు. మ్యాచ్ గెలవాలనే కసితో ఆట మీదే దృష్టి పెట్టాం. మా వాళ్లు బాగా ఆడారు. మేమేం చేయగలమో చేసి చూపించాం’ అని అల్జెరీ జోసెఫ్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. తన అభిప్రాయన్ని వ్యక్తపరిచాడు.