రాజస్థాన్ రాయల్స్ జట్టును వీడాలని సంజూ శాంసన్ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని ఫ్రాంఛైజీకి తెలియజేశాడు. ఐపీఎల్ 2026 వేలానికి ముందు తనను ట్రేడ్ విండో ద్వారా లేదంటే వేలానికి విడిచిపెట్టాలని కోరాడు. అయితే.. దీనిపై ఇంత వరకు ఆర్ఆర్ మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే దీనిపై ఆ జట్టు యజమాని మనోజ్ బాదలే, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌లు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2025 సీజన్ సమయంలో ఆర్ఆర్ మేనేజ్‌మెంట్‌తో కెప్టెన్ అయిన సంజూ శాంసన్‌కు భేదాభిప్రాయాలు వచ్చినట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఓ మ్యాచ్ టైగా ముగియగా.. సూపర్ ఓవర్ కోసం ప్లేయర్లుతో హెడ్ కోచ్ ద్రవిడ్ మాట్లాడుతుండగా కెప్టెన్ అయిన సంజూ మాత్రం దూరంగా నిలబడి ఉండడం టీవీల్లోనూ కనిపించింది. దీనిపై ద్రవిడ్ మాట్లాడుతూ.. అలాంటిది ఏమీ లేదన్నాడు. కానీ.. సీజన్ ముగిసిన వెంటనే సంజూ జట్టును వీడాలని నిర్ణయించుకున్నాడు.
తదుపరి కెప్టెన్ ఎవరు?
11 సీజన్ల పాటు రాజస్థాన్ రాయల్స్‌కు సంజూ శాంసన్ ప్రాతినిధ్యం వహించాడు. 2021లో అతడు ఆర్ఆర్‌కు కెప్టెన్ అయ్యాడు. అతడి సారథ్యంలో రాజస్థాన్ జట్టు 2022లో ఫైనల్‌కు చేరుకుంది. అత్యధిక కాలం ఆ జట్టుకు నాయకత్వం వహించిన రికార్డును శాంసన్ కలిగి ఉన్నాడు.
Haider Ali : హైదర్ అలీ ఎవరు? ఇంగ్లాండ్‌లో ఈ పాక్ యువ క్రికెటర్‌ను ఎందుకు అరెస్టు చేశారు ?
ఇదిలా ఉంటే.. సంజూ తప్పుకోనుండడంతో ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను ఎవరు చేపడుతారనే చర్చ మొదలైంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో గాయం కారణంగా శాంసన్ కొన్ని మ్యాచ్‌లకు దూరం అయిన సమయంలో యువ ఆటగాడు రియాన్ పరాగ్ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేశాడు.
2018 నుంచి రియాన్ పరాగ్ రాజస్థాన్ జట్టులో ఉంటున్నాడు. అతడి పై ఆర్ఆర్ ఫ్రాంచైజీకి ఎంతో నమ్మకం ఉంది. గత రెండు సీజన్లుగా అతడు అద్భుతంగా రాణిస్తాడు. అయితే.. నాయకుడిగా అతడు కాస్త తడబడుతున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా గత ఐపీఎల్‌లో లక్ష్యఛేదనలో ఓ తరుణంలో ఈజీగా గెలుస్తుందనుకున్న మూడు వరుస మ్యాచ్‌ల్లో ఓడిపోవడం ఆ జట్టును కలవరపెడుతోంది. ఇప్పటి వరకు పరాగ్ 8 మ్యాచ్‌ల్లో ఆర్ఆర్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆర్ఆర్ గెలుపొందింది.
యశస్వి జైస్వాల్..
యశస్వి జైస్వాల్ కూడా రాజస్థాన్ తరుపున గత కొన్ని సీజన్లుగా ఆడుతున్నాడు. అతడు కూడా నాయకత్వ రేసులో ముందు ఉన్నాడు. టీమ్ఇండియా టెస్టు జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్నాడు. అయితే.. పరాగ్ కాదని యశస్వికి ఆర్ఆర్ మేనేజ్‌మెంట్ నాయకత్వ బాధ్యతలను అప్పగిస్తాదా? లేదా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
వీరిద్దరు కాకుంటే మాత్రం ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్‌మయర్‌లు లలో ఒకరికి నాయకత్వ బాధ్యలను అప్పగించవచ్చు.