IND vs Sri Lanka : రెండవ టీ20లో ఆసక్తికర ఘటన.. బౌలింగ్, బ్యాటింగ్, ఫిల్డింగ్.. ముగ్గురు “డెబ్యూలే”

భారత్ - శ్రీలంక జట్ల మధ్య జరిగిన రెండవ టీ20 మ్యాచ్ లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ లో ఇరు జట్ల నుంచి ఐదుగురు ఆటగాళ్లు మొదటి సారి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడారు. వీరిలో భారత్ నుంచి నలుగురు ఆటగాళ్లు ఉండగా లంక నుంచి ఒకరు ఉన్నారు.

IND vs Sri Lanka : భారత్ – శ్రీలంక జట్ల మధ్య జరిగిన రెండవ టీ20 మ్యాచ్ లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ లో ఇరు జట్ల నుంచి ఐదుగురు ఆటగాళ్లు మొదటి సారి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడారు. వీరిలో భారత్ నుంచి నలుగురు ఆటగాళ్లు ఉండగా లంక నుంచి ఒకరు ఉన్నారు.

ఇక విషయానికి వస్తే.. ఈ మ్యాచ్ 18 ఓవర్ లో చేతన్ సకారియా బౌలింగ్ చేశారు. ఈ సమయంలో క్రీజ్లో ఉన్న రమేష్ మెండిస్ గల్లీ పాయింట్ దిశగా షాట్ కొట్టారు. అక్కడే ఉన్న రుతురాజ్ గైక్వాడ్ క్యాచ్ పట్టాడు. ఇక్కడ విశేషమేమిటంటే బౌలింగ్‌ చేసిన చేతన్‌ సకారియా, షాట్‌ కొట్టిన రమేష్‌ మెండిస్‌‌, క్యాచ్‌ పట్టిన రుతురాజ్‌ గైక్వాడ్‌లకు వారి జట్ల తరపున ఇదే డెబ్యూ (తొలి) మ్యాచ్‌. ఒక మ్యాచ్‌లో ముగ్గురు డెబ్యూ ప్లేయర్ల మధ్య ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం చాలా అరుదు.

ఇక రెండో టీ20 విషయానికి వస్తే.. ఈ మ్యాచ్ లో శ్రీలంక విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి కేవలం 132 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం బ్యాటింగ్ కి దిగిన లంక జట్టు 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇక మూడు టీ20ల సిరీస్ లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. గురువారం మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.

ట్రెండింగ్ వార్తలు