Virat Kohli : విరాట్ కోహ్లీ అద్భుత బౌండరీ సేవ్‌పై ఆనంద్ మహీంద్రా.. ‘హలో, ఐజాక్ న్యూటన్?’

బెంగ‌ళూరు వేదిక‌గా బుధ‌వారం రాత్రి భార‌త్‌, అఫ్గానిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ అభిమానుల‌ను మునివేళ్ల‌పై నిల‌బెట్టింది.

Anand Mahindra on Virat Kohli’s stunning boundary save

Virat Kohli – Anand Mahindra : బెంగ‌ళూరు వేదిక‌గా బుధ‌వారం రాత్రి భార‌త్‌, అఫ్గానిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ అభిమానుల‌ను మునివేళ్ల‌పై నిల‌బెట్టింది. విజ‌యం ఇరు జ‌ట్ల‌తో దోబూచులాడింది. మ్యాచులో ఇరు జ‌ట్ల స్కోర్లు స‌మం అయ్యాయి. చివ‌ర‌కు రెండో సూప‌ర్ ఓవ‌ర్ ద్వారా భార‌త్ విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో బ్యాట‌ర్‌గా కోహ్లీ విఫ‌ల‌మైన‌ప్ప‌టికీ ఫీల్డ‌ర్‌గా జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఓ బాల్‌ను సిక్స‌ర్‌గా వెళ్ల‌కుండా అడ్డుకోవ‌డంతో పాటు ఓ అద్భుత ర‌న్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు.

కోహ్లీ అద్భుత ఫీల్డింగ్‌..

అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్ 17వ ఓవ‌ర్‌ను భార‌త బౌల‌ర్‌ వాషింగ్ట‌న్ సుంద‌ర్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని నాలుగో బంతిని అఫ్గాన్ బ్యాట‌ర్ క‌రీం జ‌న‌త్ భారీ షాట్ ఆడాడు. మిడ్ వికెట్ వైపు బంతి సిక్స‌ర్ వెలుతోంది. అయితే.. బౌండ‌రీ లైన్ వ‌ద్ద కోహ్లీ స‌మ‌యానుకూల‌మైన‌ జంప్‌తో బంతిని అడ్డుకున్నాడు. కోహ్లీ క్యాచ్‌గా అందుకోలేక‌పోయిన‌ప్ప‌టికీ బంతిని బౌండ‌రీ వెళ్ల‌కుండా ఆపాడు. దీంతో ఆరు ప‌రుగులు వ‌స్తాయ‌నుకున్న అఫ్గాన్ చివ‌రికి సింగిల్‌తో స‌రిపెట్టుకుంది. దీంతో స్టేడియం మొత్తం కోహ్లీ నామ‌స్మ‌ర‌ణ‌తో మారుమోగిపోయింది. ఒక‌వేళ ఈ బాల్ గ‌నుక సిక్స్‌గా వెళ్లిఉంటే.. మ్యాచ్ టై అయ్యే అవ‌కాశం ఉండేది కాదు. అఫ్గాన్ విజ‌యం సాధించి ఉండేది.

కోహ్లీ ఈ అద్భుత విన్యాసానికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇదీ ప్ర‌ముఖ వ్యాపారవేత్త ఆనంద్ మ‌హీంద్రాను ఆక‌ట్టుకుంది. దీనిపై మ‌హీంద్ర చేసిన పోస్ట్ సైతం వైర‌ల్‌గా మారింది. కోహ్లీ బంతిని ఆపే ఫోటోను పోస్ట్ చేస్తూ.. “హలో ఐజాక్ న్యూటన్? ఈ గురుత్వాకర్షణ వ్యతిరేక దృగ్విషయానికి సంబంధించి భౌతిక శాస్త్రానికి సంబంధించిన కొత్త నియమాన్ని నిర్వచించడంలో మీరు మాకు సహాయం చేయగలరా??” అంటూ రాసుకొచ్చాడు.

బౌండ‌రీ లైన్ వద్ద కోహ్లీ చేసిన అద్భుత‌మైన ఫీల్డింగ్ పై నెటిజ‌న్లు ఎలా స్పందిస్తున్నారో చూడండి..