Andhra Premier League Season 4 Auction Details
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) నాలుగో సీజన్ ఆగస్టు 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ప్లేయర్ల వేలం ప్రక్రియ మొదలైంది. మొత్తం 520 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నాలుగో సీజన్‌లో పోటీపడనున్న ఏడు జట్లు.. అమరావతి రాయల్స్, విజయవాడ సన్ షైనర్స్, రాయల్స్ ఆఫ్ రాయలసీమ, తుంగభద్ర వారియర్స్, సింహాద్రి వైజాగ్ వారియర్స్, కాకినాడ కింగ్స్, భీమవరం బుల్స్ వేలంలో పాల్గొన్నాయి. ఒక్కొ జట్టు గరిష్టంగా 20 మందిని, కనిష్టంగా 18 మంది తీసుకోవచ్చు.
ఆల్ రౌండర్ల కోసం ఫ్రాంచైజీలు ఎక్కువగా పోటీపడుతున్నాయి. పైలా అవినాష్ ను రూ.11.5 లక్షలకు రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు దక్కించుకుంది. పీవీ సత్యానారాయణ రాజును రూ. 9.8 లక్షలకు భీమవరం బుల్స్ జట్టు దక్కించుకుంది.
ENG vs IND : సిరాజ్‌కు ఐసీసీ షాక్.. భారీ జరిమానా ఇంకా..
వేలంలో ఎవరు ఎంత పలికారంటే..
త్రిపురాన విజయ్ – రూ. 7.55 లక్షలు (సింహాద్రి వైజాగ్ లయన్స్)
సౌరభ్ కుమార్ – రూ. 8.8 లక్షలు (తుంగభద్ర వారియర్స్)
వై.పృథ్వీరాజ్ – రూ.8.05 లక్షలు (విజయవాడ సన్‌షైనర్స్)
జి.మనీష్ – రూ.3.45 లక్షలు (కాకినాడ కింగ్స్)
ఎం.ధీరజ్ కుమార్ – రూ. 6.5 లక్షలు (విజయవాడ సన్‌షైనర్స్)
పి.తపస్వి – రూ.5.3 లక్షలు (కాకినాడ కింగ్స్)
వై.సందీప్ – రూ.1.75 లక్షలు (అమరావతి రాయల్స్)
బి.వినయ్ కుమార్ -రూ.7.5 లక్షలు (అమరావతి రాయల్స్)
ENG vs IND : ఇంగ్లాండ్ కోచ్‌కు వాషింగ్టన్ సుందర్ కౌంటర్..
కె.కరణ్ శిందే – రూ.3.5 లక్షలు (అమరావతి రాయల్స్)
ఎం.వంశీ కృష్ణ – రూ.6.5 లక్షలు (విజయవాడ సన్‌షైనర్స్)
పి.గిరినాథ్ రెడ్డి – రూ.10.5 లక్షలు (రాయల్స్ ఆఫ్ రాయలసీమ)
బి. యశ్వంత్ – రూ.6.5 లక్షలు (సింహాద్రి వైజాగ్ లయన్స్)
ఎస్‌డీఎన్ వర ప్రసాద్ – రూ.9.5 లక్షలు (అమరావతి రాయల్స్)
ఎ.లలిత్ మోహన్ – రూ.3.25 లక్షలు (విజయవాడ సన్‌షైనర్స్)
కేపీ సాయి రాహుల్ – రూ.4.75 లక్షలు (కాకినాడ కింగ్స్)
కె.సాయి తేజ – రూ.1.25 లక్షలు (సింహాద్రి వైజాగ్ లయన్స్)
కె.సుదర్శన్ – రూ.3.25 లక్షలు (కాకినాడ కింగ్స్)
ఎం.హరి శంకర్ రెడ్డి – రూ.4.5 లక్షలు (భీమవరం బుల్స్)