ENG vs IND : సిరాజ్‌కు ఐసీసీ షాక్.. భారీ జరిమానా ఇంకా..
టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌కు ఐసీసీ షాక్ ఇచ్చింది. అ

ENG vs IND 3rd Test Mohammed Siraj was fined 15 per cent of his match fee
టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌కు ఐసీసీ షాక్ ఇచ్చింది. అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానాగా విధించింది. అంతేకాదండోయ్ అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను చేర్చింది. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ నాలుగో రోజు ఆటలో సిరాజ్ ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించడంతో ఐసీసీ ఫైన్ వేసింది.
అసలేం జరిగిందంటే..?
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులు చేసింది. ఆ తరువాత భారత్ తన మొదటి ఇన్నింగ్స్‌లో సరిగ్గా 387 పరుగులే చేసింది. ఆ తరువాత ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా క్యాచ్ అందుకోవడంతో ఓపెనర్ బెన్‌డకెట్ (12) ఔట్ అయ్యాడు. డకెట్ పెవిలియన్‌కు వెలుతున్న క్రమంలో సిరాజ్ అతడికి దగ్గరగా వెళ్లి దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు. ఇది ఐసీసీ ప్రవర్తనా నియమావళికి విరుద్దం..
ENG vs IND : ఇంగ్లాండ్ కోచ్‌కు వాషింగ్టన్ సుందర్ కౌంటర్..
Mohammad Siraj has been fined 15% of his match fees. pic.twitter.com/C3qYR9JybI
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 14, 2025
ఐసిసి ఆటగాళ్లు, ఆటగాళ్ల సహాయ సిబ్బంది ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5 ను సిరాజ్ ఉల్లంఘించాడని ఐసీసీ తెలిపింది. ఈ క్రమంలో అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానాగా విధించడంతో పాటు అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను చేర్చినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
కాగా.. ఓ ఆటగాడి ఖాతాలో 24 నెలల వ్యవధిలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు చేరితే అవి సస్పెన్షన్ పాయింట్లుగా మారుతాయి. అప్పుడు ఆటగాడిపై నిషేదం విధిస్తారు. రెండు సస్పెన్షన్ పాయింట్లు ఒక టెస్ట్ లేదా రెండు ODIలు లేదా రెండు T20Iల నిషేధానికి సమానం.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులకు కుప్పకూలింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్ (33) క్రీజులో ఉన్నాడు. ఆఖరి రోజు భారత విజయానికి మరో 135 పరుగులు అవసరం కాగా.. ఇంగ్లాండ్ గెలుపుకు 6 వికెట్లు కావాలి.