ENG vs IND: భీకర ఫామ్ లో ఉన్న శుభ్ మన్ గిల్ పై బెన్ డకెట్ స్లెడ్జింగ్.. ‘ఇంక చాల్లే..’ అంటూ..

లార్డ్స్ వేదిక‌గా భారత్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో గెలిచేందుకు ఇంగ్లాండ్ కుయుక్తుల‌ను ప్ర‌ద‌ర్శిస్తోంది

ENG vs IND: భీకర ఫామ్ లో ఉన్న శుభ్ మన్ గిల్ పై బెన్ డకెట్ స్లెడ్జింగ్.. ‘ఇంక చాల్లే..’ అంటూ..

ENG vs IND 3rd test Ben Stokes Sledging Shubman Gill

Updated On : July 14, 2025 / 2:34 PM IST

లార్డ్స్ వేదిక‌గా భారత్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో గెలిచేందుకు ఇంగ్లాండ్ కుయుక్తుల‌ను ప్ర‌ద‌ర్శిస్తోంది. టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్ స‌మ‌యంలో మైండ్ గేమ్ మొద‌లెట్టింది. మొద‌ట‌గా ఈ సిరీస్‌లో భీక‌ర ఫామ్‌లో ఉన్న టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్‌ను ల‌క్ష్యంగా చేసుకుంది.

ఈ సిరీస్‌లోని తొలి రెండు టెస్టుల్లో క‌లిపి గిల్ 585 పరుగులు చేశాడు. ఇక లార్డ్స్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 16 ప‌రుగులు చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో అత‌డు బ్యాటింగ్‌కు వ‌చ్చిన స‌మ‌యంలో ఇంగ్లీష్ ఆట‌గాళ్లు స్లెడ్జింగ్ చేశారు. ఈ సిరీస్‌తో అయిపోయావు. ఇప్ప‌టికే 600+ స్కోరు చేశావు. ఇత‌డికి ఇవి స‌రిపోతాయ‌ని బెన్‌డ‌కెట్‌ ఎగ‌తాళిగా మాట్లాడాడు.

ENG vs IND: వామ్మో శుభ్‌మ‌న్‌ గిల్ మామూలోడు కాదు.. 23 ఏళ్లు ప‌దిలంగా ఉన్న రాహుల్ ద్ర‌విడ్ రికార్డు బ‌ద్ద‌లు..

దుర‌దృష్ట వ‌శాత్తు గిల్ రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫ‌లం అయ్యాడు. 9 బంతులు ఆడిన గిల్ 6 ప‌రుగులు మాత్ర‌మే చేసి బ్రైడాన్ కార్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. డీఆర్ఎస్ తీసుకున్నా ఫ‌లితం లేక‌పోయింది. ఈ క్ర‌మంలో ఇంగ్లాండ్ ఆట‌గాళ్లు మ‌రింతగా రెచ్చిపోయి సంబ‌రాలు చేసుకున్నారు.

MLC 2025 : మేజ‌ర్ లీగ్ క్రికెట్ 2025 విజేత‌గా ముంబై.. అద‌ర‌గొట్టిన క్వింట‌న్ డికాక్‌, ట్రెంట్ బౌల్ట్‌..

లార్డ్స్ టెస్టు మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ మొద‌టి ఇన్నింగ్స్‌లో 387 ప‌రుగులు చేసింది. ఆ త‌రువాత భార‌త్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో స‌రిగ్గా 387 ప‌రుగులే చేసింది. ఆ త‌రువాత ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 192 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

దీంతో భార‌త్ ముందు 193 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది. ల‌క్ష్య ఛేద‌న‌లో భార‌త్‌ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 4 వికెట్ల న‌ష్టానికి 58 ప‌రుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్ (33) ఉన్నాడు. భార‌త విజ‌యానికి ఆఖ‌రి రోజు 135 ప‌రుగులు అవ‌స‌రం కాగా.. ఇంగ్లాండ్ గెలుపుకు మ‌రో 6 వికెట్లు కావాలి.