ENG vs IND: వామ్మో శుభ్‌మన్ గిల్ మామూలోడు కాదు.. 23 ఏళ్లు పదిలంగా ఉన్న రాహుల్ ద్రవిడ్ రికార్డు బద్దలు..
ఇంగ్లాండ్ గడ్డపై టీమ్ఇండియా టెస్టు శుభ్‌మన్ గిల్ రికార్డులు బ్రేక్ చేస్తూనే ఉన్నాడు.

IND vs ENG 3rd Test Gill breaks Dravid 23 year old record
ఇంగ్లాండ్ గడ్డపై టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డులు బ్రేక్ చేస్తూనే ఉన్నాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో విఫలమైనప్పటికి కూడా ఓ అరుదైన ఘనత సాధించాడు. 9 బంతులు ఆడి ఓ ఫోర్ సాయంతో 6 పరుగులు చేసి బ్రైడాన్ కార్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేరుకున్నాడు గిల్. ఈ క్రమంలో ఇంగ్లాండ్ గడ్డ పై ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
గతంలో ఈ రికార్డు రాహుల్ ద్రవిడ్ పేరిట ఉండేది. 23 ఏళ్ల కిందట అంటే.. 2002లో ఇంగ్లాండ్ పర్యటనలో ద్రవిడ్ 602 పరుగులు సాధించాడు. కాగా.. ఈ సిరీస్‌లో గిల్ ఇప్పటి వరకు 607 పరుగులు చేశాడు. ఇక ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 593 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.
ఇంగ్లాండ్ గడ్డపై ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు వీరే..
శుభ్‌మన్ గిల్ – 607 * పరుగులు (2025లో)
రాహుల్ ద్రవిడ్ – 602 పరుగులు (2002లో)
విరాట్ కోహ్లీ – 593 పరుగులు (2018లో)
సునీల్ గవాస్కర్ – 542 పరుగులు (1979లో)
రాహుల్ ద్రవిడ్ – 461 పరుగులు (2011లో)
ఇక లార్డ్స్ టెస్టు మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 387 పరుగులు చేసింది. ఆ తరువాత భారత్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో సరిగ్గా 387 పరుగులే చేసింది. ఆ తరువాత ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ముందు 193 పరుగుల లక్ష్యం నిలిచింది.
ENG vs IND : లార్డ్స్‌లో టీమ్ఇండియా విజయవంతమైన లక్ష్య ఛేదన ఎంతో తెలుసా? వార్నీ ఇప్పుడెలా..
ఈ లక్ష్య ఛేదనలో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్ (33) ఉన్నాడు. భారత విజయానికి ఆఖరి రోజు 135 పరుగులు అవసరం కాగా.. ఇంగ్లాండ్ గెలుపుకు మరో 6 వికెట్లు కావాలి.