WI vs ENG 2nd T20 : సిక్స్ ఇలా కొట్టాల‌ని ఇన్ని రోజులు తెలియ‌దు భ‌య్యా..! వీడియో వైర‌ల్‌

West Indies vs England 2nd T20 : వెస్టిండీస్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన రెండో టీ20 మ్యాచులో ఓ స‌ర‌దా ఘ‌ట‌న చోటు చేసుకుంది.

వెస్టిండీస్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన రెండో టీ20 మ్యాచులో ఓ స‌ర‌దా ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో విండీస్ విధ్వంస‌క‌ర వీరుడు ఆండ్రూ ర‌స్సెల్ సిక్స్ కొట్టి అదుపు త‌ప్పి కింద ప‌డిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

గురువారం ఇంగ్లాండ్‌, వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య రెండో టీ20 మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో విండీస్ జ‌ట్టు మొద‌ట బ్యాటింగ్ చేసింది. బ్రెండ‌న్ కింగ్ (82; 52 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), పావెల్ (50; 28 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) లు అర్ధ‌శ‌త‌కాల‌తో రాణించ‌డంతో విండీస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల న‌ష్టానికి 176 ప‌రుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో ఆదిల్ ర‌షీద్‌, మిల్స్ లు చెరో రెండు వికెట్లు తీశారు. క్రిస్‌వోక్స్‌, సామ్ క‌ర‌ణ్‌, రెహ్మ‌న్ అహ్మ‌ద్ లు తలా ఓ వికెట్ సాధించారు.

Kuldeep Yadav : కుల్దీప్‌యాద‌వ్ అరుదైన ఘ‌న‌త‌.. ప్ర‌పంచ క్రికెట్‌లో ఒకే ఒక్క‌డు..

భారీ సిక్స్ బాది..

వెస్టిండీస్ ఇన్నింగ్స్ ఆఖ‌రి ఓవ‌ర్‌లో స‌ర‌దా ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ బౌల‌ర్ మిల్స్ వేసిన బంతిని వెస్టిండీస్ బ్యాట‌ర్ ర‌సెల్ భారీ షాట్ కొట్టాడు. బంతి సిక్స‌ర్‌గా వెళ్లింది. అయితే.. షాట్ కొట్టిన త‌రువాత ర‌సెల్ బ్యాలెన్స్ కోల్పోయాడు. బంతి బౌండ‌రీ లైన్ దాటేలోపే బొక్క‌బోర్లా ప‌డ్డాడు. కాగా.. ఆ స‌మ‌యంలో కామెంటేట‌ర్లు మాట్లాడుతూ.. ఇలాంటివి ర‌సెల్ కే సాధ్య‌మ‌న్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు స‌ర‌దాగా కామెంట్లు చేస్తున్నారు. సిక్స‌ర్ ఇలా కొట్టాల‌ని మాకు తెలియ‌దు అని ఒక‌రు అన‌గా.. ఇలాంటి సిక్స‌ర్ తామెన్న‌డూ చూడ‌లేద‌ని మ‌రికొంద‌రు కామెంట్లు చేస్తున్నారు.

IND vs SA : డేవిడ్ మిల్ల‌ర్‌కు అంపైర్ సాయం..! ఔటైనా నాటౌట్‌.. వీడియో వైర‌ల్‌

ఇదిలా ఉంటే.. ల‌క్ష్య ఛేద‌న‌లో ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి 166 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. సామ్ క‌ర‌ణ్ (50; 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కంతో రాణించిన‌ప్ప‌టికీ 10 ప‌రుగుల తేడాతో ఇంగ్లాండ్‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు. వెస్టిండీస్ బౌల‌ర్ల‌లో అల్జారీ జోసెఫ్ మూడు వికెట్లు తీశాడు. అకిల్ హోసెన్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. జేస‌న్ హోల్డ‌ర్‌, మోతీలు చెరో వికెట్ ప‌డ‌గొట్టారు. ఈ విజ‌యంతో విండీస్ ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.

 

ట్రెండింగ్ వార్తలు