IND vs SA : డేవిడ్ మిల్లర్‌కు అంపైర్ సాయం..! ఔటైనా నాటౌట్.. వీడియో వైరల్
India vs South Africa : మూడో టీ20 మ్యాచులో అంపైర్ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదమైంది.

IND vs SA 3rd T20 India misses out on review due to DRS unavailability
జొహానెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచులో భారత జట్టు 106 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో మూడు మ్యాచుల టీ20 సిరీస్ 1-1తో సమమైంది. అయితే.. ఈ మ్యాచ్‌లో అంపైర్ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదమైంది. అదే సమయంలో డీఆర్ఎస్ పని చేయలేదు. దీంతో బ్యాటర్ బతికిపోయాడు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్‌గా మారింది. అంపైర్ పై, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు పై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
అసలు ఏం జరిగిందంటే.. ?
ఈ మ్యాచ్‌లో మొదట భారత్ బ్యాటింగ్ చేసింది. సూర్యకుమార్ యాదవ్ (100; 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (60; 41బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్, విలియమ్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. షంసీ, బర్గర్ తలా ఓ వికెట్ తీశారు.
AUS vs PAK : బాల్‌లో బీసీసీఐ చిప్ పెట్టింది..! అందుకే పాక్ ఆటగాళ్లు ఇలా..
అనంతరం 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దక్షిణాఫ్రికా జట్టు బరిలోకి దిగింది. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌ను రవీంద్ర జడేజా వేశాడు. ఈ ఓవర్‌లోని నాలుగో బంతిని సఫారీ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ కట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ జితేశ్ శర్మ చేతుల్లోకి వెళ్లింది. వెంటనే బౌలర్, కీపర్‌తో పాటు ఫీల్డర్లు ఔట్ అంటూ అప్పీల్ చేశారు. అయితే.. అంపైర్ అల్లావుదీన్ పాలేకర్ నాటౌట్ ఇచ్చాడు.
There was an edge from David Miller’s bat, but DRS is currently unavailable so it was not out. pic.twitter.com/XVQkkyqvin
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 14, 2023
దీంతో టీమ్ఇండియా ఆటగాళ్లు రివ్యూ తీసుకోవాలని భావించారు. అయితే.. ఆ సమయంలో సాంకేతిక లోపం కారణంగా డిఆర్ఎస్ పనిచేయడం లేదని చావు కబురు చల్లగా చెప్పారు. అంపైర్ నిర్ణయంతో మిలర్ బతికిపోయాడు. అంపైర్ నిర్ణయం పై రవీంద్ర జడేజాతో పాటు సూర్యకుమార్ యాదవ్, కోచ్ రాహుల్ ద్రవిడ్‌లు అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాగా.. రిప్లేలో బంతి ఎడ్జ్ తీసుకున్నట్లుగా స్పష్టంగా కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు దక్షిణాప్రికా క్రికెట్ బోర్డు పై విమర్శలు గుప్పిస్తున్నారు.
IND-W vs ENG-W Test : దీప్తిశర్మ సంచలన స్పెల్.. కుప్పకూలిన ఇంగ్లాండ్.. భారత్‌కు భారీ ఆధిక్యం
కాగా.. కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లతో రాణించడంతో దక్షిణాఫ్రికా జట్టు 13.5 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటైంది.
— Nihari Korma (@NihariVsKorma) December 14, 2023