Anushka Sharma and Virat Kohli to settle in London permanently
Virat Kohli : భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ అత్యంత పాపులర్ జంటలలో ఒకరు. విరాట్ కోహ్లీ త్వరలో తన ఫ్యామిలీతో కలిసి భారత్ వదిలి లండన్‌కు షిప్ట్ కానున్నాడు. ఎప్పటినుంచో కలలు కంటున్న తమ జీవితానికి సంబంధించి, భార్య అనుష్క, పిల్లలు వామిక, అకాయ్‌లతో సహా కోహ్లీ లండన్‌లో స్థిరపడనున్నట్టు తెలుస్తోంది.
2024 ఏడాది ప్రారంభంలో కుటుంబం లండన్‌కు శాశ్వతంగా వెళ్లవచ్చునని పుకార్లు వ్యాపించాయి. విరాట్ స్వయంగా తన భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడటంతో ఈ ఊహాగానాలకు ఆజ్యం పోసింది. తన క్రికెట్ కెరీర్ ముగిసే సమయానికి, ప్రజా జీవితానికి వీడ్కోలు పలకనున్నట్టు పేర్కొన్నాడు. కోహ్లీ చిన్ననాటి కోచ్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అనుష్క శర్మ, పిల్లలతో కలిసి లండన్‌కు వెళ్లాలని విరాట్ తీసుకున్న నిర్ణయం గురించి మాజీ కోచ్ బయటపెట్టడంతో ఈ పుకార్లకు మరింత బలాన్ని ఇచ్చింది.
కోహ్లీ లండన్ ఎందుకు వెళ్లనున్నాడంటే? :
క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత మిగిలిన లైఫ్ అంతా యూకేలో గడపాలని కోహ్లీ భావిస్తున్నాడట. కోహ్లీ తరచుగా లండన్ పర్యటనకు వెళ్లి వస్తుండేవాడు. విరుష్క జంట కుమారుడు అకాయ్ 2024 ఫిబ్రవరి 15న లండన్‌లోనే పుట్టాడు. కోహ్లీ ఫ్యామిలీ కూడా ఈ ఏడాదిలో ఎక్కువగా లండన్‌లోనే గడిపారు. 2024 టీ20 ప్రపంచ కప్ తర్వాత ఫ్యామిలీ కోసం విరాట్ యూకేకు వెళ్లాడు. కోహ్లీకి లండన్‌లో ఆస్తులు ఉన్నాయట. అందుకే, కోహ్లీ తన పిల్లలతో కలిసి లండన్ వెళ్లాలని భావిస్తున్నాడని కోచ్ రాజ్‌కుమార్ శర్మ పేర్కొన్నారు.
రిటైర్మెంట్ ఆలోచన లేదు.. వచ్చే ఐదేళ్లు కోహ్లీ ఆడుతాడు :
‘నా అభిప్రాయం ప్రకారం.. విరాట్ ఇప్పటికీ చాలా ఫిట్‌గా ఉన్నాడు. అతని వయస్సు రిటైర్మెంట్ గురించి ఆలోచించే విధంగా లేదు. వచ్చే ఐదేళ్లపాటు విరాట్ క్రికెట్ ఆడతాడు. 2027 ప్రపంచకప్‌లో కూడా భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడని నమ్ముతున్నాను. ఎలాంటి క్లిష్ణ పరిస్థితుల్లో కూడా అద్భుతంగా రాణించి జట్టును విజయపథంలో నడిపించే ఆటగాడు విరాట్. తన కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ, ఎప్పుడూ బలంగా ఎదిగాడు’ అని కోచ్ శర్మ తెలిపారు.
కోచ్ కోహ్లి ఫిట్‌నెస్, పని నీతిని కూడా ప్రశంసించాడు. రాబోయే సంవత్సరాల్లో క్రికెటర్ ఆటను చాలా అందించగలడని విశ్వాసం వ్యక్తం చేశాడు. కోహ్లి క్రికెట్ భవిష్యత్తు భద్రంగా కనిపిస్తున్నప్పటికీ, విదేశాలకు మకాం మార్చాలని విరాట్ తీసుకున్న నిర్ణయం అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.