Anushka Sharma Viral Post : భర్త కోహ్లీపై అనుష్కా శర్మ తాజా కామెంట్… వైరల్ అయిన సోషల్ మీడియా పోస్టు

క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో విరాట్ కోహ్లీ 50వ సెంచరీ సాధించిన తర్వాత అతని భార్య, ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మ చేసిన ఎక్స్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023 సెమీఫైనల్‌లో వాంఖడే స్టేడియం స్టాండ్‌లో తన భర్త విరాట్ కోహ్లీని ఉత్సాహపరిచేందుకు బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ స్టేడియానికి వచ్చారు....

Anushka Sharma Viral Post : క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో విరాట్ కోహ్లీ 50వ సెంచరీ సాధించిన తర్వాత అతని భార్య, ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మ చేసిన ఎక్స్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023 సెమీఫైనల్‌లో వాంఖడే స్టేడియం స్టాండ్‌లో తన భర్త విరాట్ కోహ్లీని ఉత్సాహపరిచేందుకు బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ స్టేడియానికి వచ్చారు. కోహ్లీ 50వ సెంచరీ సాధించగానే స్టేడియం గ్యాలరీలో నుంచి అనుష్కా శర్మ గాల్లో ముద్దులు విసిరారు.

ALSO READ : Legend King kohli : సెంచరీ రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ

ప్రతిగా తన భార్య అనుష్కాశర్మకు కోహ్లీ గాల్లోనే గ్రౌండ్ నుంచి ఫ్లయింగ్ కిస్ లు ఇచ్చారు. భర్త కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన సెంచరీ తర్వాత అతన్ని దేవుని బిడ్డ అంటూ అనుష్క సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ రాసింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ 2023 తొలి సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 70 పరుగుల తేడాతో విజయం సాధించి, 50 వన్డే సెంచరీలు సాధించిన తొలి బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ బుధవారం చరిత్ర పుస్తకాలను తిరగరాశారు.

ALSO READ : IND vs NZ Semi Final : ప్ర‌తీకారం తీర్చుకున్న భార‌త్‌.. న్యూజిలాండ్ పై ఘ‌న విజ‌యం.. ఫైన‌ల్‌లోకి.. ఇంక్కొక్క‌టే..!

కోహ్లి చేసిన 117 పరుగులు ప్రపంచ కప్‌లో అతని మూడవ శతకంగా నిలిచింది. ‘‘దేవుడు ఉత్తమ స్క్రిప్ట్ రైటర్! మీ ప్రేమతో ఆశీర్వదించారు. క్రీడ పట్ల ఎల్లప్పుడూ నిజాయితీగా ఉన్నందుకు కృతజ్ఞతలు. నువ్వు నిజంగా దేవుడి బిడ్డవి’’ అని అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అత్యధిక ఓడీఐ సెంచరీల రికార్డును అధిగమించిన తర్వాత కోహ్లి తనకు ఇది ఒక కలలా అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. తన సెంచరీ తర్వాత స్టాండ్స్‌లో ఉన్న టెండూల్కర్‌కు కోహ్లీ వంగి వంగి అభివాదం చేశారు.

ట్రెండింగ్ వార్తలు