Legend King kohli : సెంచరీ రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ

టీం ఇండియా మాజీ కెప్టెన్, కింగ్ విరాట్ కోహ్లీ ప్రపంచ కప్ పోటీల్లో న్యూజీలాండ్ జట్టుపై సెంచరీ సాధించి పరుగుల రారాజుగా నిలిచారు. 49 వన్డే శతకాల సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించిన కోహ్లీ రికార్డు సృష్టించారు....

Legend King kohli : సెంచరీ రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ

Legend King kohli

Legend King kohli : టీం ఇండియా మాజీ కెప్టెన్, కింగ్ విరాట్ కోహ్లీ ప్రపంచ కప్ పోటీల్లో న్యూజీలాండ్ జట్టుపై సెంచరీ సాధించి పరుగుల రారాజుగా నిలిచారు. 49 వన్డే శతకాల సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించిన కోహ్లీ రికార్డు సృష్టించారు. ప్రపంచ కప్ పోరులో 50 సెంచరీలు చేసి సెంచరీల రారాజుగా కోహ్లీ నిలిచారు. జీవనశైలి, ఆహారపు అలవాట్లు మార్చుకొని నిత్యం జిమ్ లో శ్రమిస్తూ, మరోవైపు ప్రాక్టీస్ చేస్తూ కోహ్లీ కండలు తిరిగిన దేహంతో ఫిట్ నెస్ గా ఉన్నారు. కోహ్లీ బుధవారం న్యూజీలాండ్ జట్టుపై ప్రతిష్ఠాత్మక వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ లో 117 పరుగులు తీసి అందరి ప్రశంసలు అందుకున్నారు.

భార్య అనుష్కాశర్మకు గాల్లో కోహ్లీ ముద్దుల వర్షం

ప్రపంచకప్ లో 49వ వన్డే శతకంతో సచిన్ ను సమం చేసిన కోహ్లీ మైదానం నుంచే అతడికి అభివాదం చేశారు. సెంచరీ చేిన కోహ్లీ గ్రౌండులో మోకాళ్లపై కూర్చొని రెండు చేతులు పైకెత్తి అభిమానులు, సచిన్ కు అభివాదం చేశారు. అనంతరం గాల్లో ముద్దులు విసురుతున్న తన భార్య అనుష్కాశర్మకు కోహ్లీ ముద్దుల వర్షం కురిపించారు. వన్డేల్లో 50 శతకం చేసిన విరాట్ కోహ్లీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు.

విరాట్ కోహ్లీ సెంచరీల రికార్డు

విరాట్ కోహ్లీ ప్రపంచ వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో 50 సెంచరీలు సాధించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఏ దేశ క్రికెట్ జట్టు అయినా కోహ్లీ శతకాలతో ప్రత్యర్థులను ఓడించారు. అత్యధికంగా శ్రీలంక జట్టుపై 10 మ్యాచ్ లలో సెంచరీలు చేసి కోహ్లీ కింగ్ గా నిలిచారు. వెస్ట్ ఇండీస్ జట్టుపై 9 శతకాలు, ఆస్ట్రేలియాపై 8, న్యూజీలాండ్ పై 6, దక్షిణాఫ్రికాపై 5, బంగ్లాదేశ్ జట్టుపై 5, ఇంగ్లాండుపై 3, పాకిస్థాన్ జట్టుపై మూడు, జింబాబ్వేపై ఒక సెంచరీ చేసి రికార్డు నెలకొల్పారు.

స్టేడియం ఏదైనా పరుగుల వరద 

2009వ సంవత్సరంలో కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియంలో శ్రీలంక జట్టుపై 107 పరుగులు తీసిన కోహ్లీ సెంచరీలకు శ్రీకారం చుట్టారు. 2010వ సంవత్సరం ఢాకాలో బంగ్లాదేశ్ జట్టుపై ఆడిన కోహ్లీ 102 పరుగులు తీసి భేష్ అనిపించుకున్నారు. విశాఖపట్టణం స్టేడియంలో 2010లో ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో 118 పరుగులు తీసి క్రికెట్ అభిమానులను అలరించారు. గౌహతిలో న్యూజిలాండ్ జట్టుపై 105 పరుగులు చేశారు. 2011వ సంవత్సరంలో ఇంగ్లాండ్,వెస్టీండీస్ జట్లపై మూడు సెంచరీలు చేసి రికార్డు నెలకొల్పారు.

సెంచరీలపై సెంచరీలు…

2012వ సంవత్సరంలో జరిగిన పోటీల్లో శ్రీలంక, పాకిస్థాన్ జట్లపై ఐదు శతకాలు చేశారు. 2013వ సంవత్సరంలో కోలోంబో, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, హరారే, జైపూర్ , నాగపూర్ స్టేడియాల్లో జరిగిన ప్రపంచ కప్ పోటీల్లో కోహ్లీ నాలుగు సెంచరీలు సాధించారు. 2014వ సంవత్సరంలో వెస్టీండీస్, శ్రీలంక జట్లతో జరిగిన పోరులో శతకాలు చేశారు. 2015 వ సంవత్సరంలో అడిలైడ్, చెన్నై స్టేడియాల్లో పాకిస్థాన్, సౌత్ ఆఫ్రికా జట్లపై సెంచరీలు చేశారు.

కోహ్లీ రికార్డులు…

2016వ సంవత్సరంలో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ జట్లతో జరిగిన పోరులో కోహ్లీ 154 పరుగులు చేసి రికార్డు సృష్టించారు. 2017వ సంవత్సరంలో పూణే, కింగ్ స్టన్, కోలోంబో, ముంబయి, కాన్పూర్ ఇలా ఏ స్టేడియం అయినా పరుగుల వరద పారించిన కోహ్లీ ఐదు సెంచరీలు చేశారు. 2018వ సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా, వెస్టీండీస్, జట్లతో తలపడిన విరాట్ ఆరు సెంచరీలు చేసి ఘనత సాధించారు. 2019వ సంవత్సరంలో జరిగిన ఐదు మ్యాచ్ లలో ఆస్ట్రేలియా, వెస్టీండీస్ జట్లపై ఐదు శతకాలు సాదించారు.

కోహ్లీకి అభిమానుల ప్రశంసలు…

2022వ సంవత్సరంలో బంగ్లాదేశ్ జట్టుపై 113 పరుగులు చేశారు. ఈ ఏడాది గౌహతిలో శ్రీలంక జట్టుతో జరిగిన పోరులో కోహ్లీ 113 పరుగులు తీశారు. తిరువంతపురంలో జరిగి శ్రీలంకతో జరిగిన పోటీలో 166 పరుగులు తీసిన కోహ్లీ భేష్ అనిపించుకున్నారు. కోలోంబోలో పాకిస్థాన్ జట్టుపై పోటీలో కోహ్లీ 122 పరుగులు తీశారు.

దటీజ్ విరాట్ కోహ్లీ

పూణే స్టేడియంలో బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన పోటీలో 103 పరుగులు, కోల్ కతాలో సౌత్ ఆఫ్రికా జట్టుపై 101 పరుగులు తీసిన కోహ్లీ అభిమానుల ప్రశంసలు అందుకున్నారు. ముంబయి నగరంలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన ప్రపంచ కప్ సెమీ ఫైనల్ లో మరో శతకం చేసి ప్రపంచ కప్ పోటీల్లో 50 శతకాలు చేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. దటీజ్ విరాట్ కోహ్లీ క్రికెట్ అభిమానులతో ఔరా అనిపించుకున్నారు.