virat and anushka
Virat Kohli: ఆస్ట్రేలియాతో భారత్ 4వ టెస్ట్ మ్యాచ్‌కు ముందు టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ తన సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు. శనివారం ఉదయం ఆలయానికి చేరుకొని వారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉజ్జయినీ మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగాన్ని సందర్శించారు. శివలింగానికి పాలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భస్మ హారతిలో పాల్గొన్నారు. విరుష్క దంపతులను అర్చకులు ఆశీర్వదించారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు ఉజ్జయినీ ఆలయ దర్శనానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మహాకాళేశ్వర్ ఆలయంలో బ్రహ్మ ముహూర్తం ఉదయం 4గంటల నుంచి ఐదున్నర గంటల సమయంలో ఈ భస్మ హారతిని నిర్వహిస్తారు. విరాట్ దంపతులు ఉదయాన్నే ఆలయానికి చేరుకున్నారు. విరాట్ ధోతీ ధరించగా, అనుష్క పిచ్ కలర్ శారీలో ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆ తరువాత కొంత సమయం విరాట్ దంపతులు ఆలయంలో గడిపారు. ఈసందర్భంగా న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో అనుష్క శర్మ మాట్లాడుతూ.. మేము ప్రార్థనలు చేయడానికి ఇక్కడికి వచ్చాము. మహాకాళేశ్వర్ ఆలయంలో మంచి దర్శనం పొందామని తెలిపారు.
#WATCH | Actor Anushka Sharma & Cricketer Virat Kohli offered prayers to Lord Shiva at Mahakaleshwar temple in Ujjain, Madhya Pradesh today morning pic.twitter.com/FBq3KsrNU2
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 4, 2023
ఇదిలాఉంటే విరాట్, అనుష్క దంపతులు ఇటీవల ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో వారి కుమార్తెతో కలిసి రిషికేశ్, బృందావన్ ని సందర్శించారు. బృందావన్ లో ఉన్నప్పుడు, కుటుంబ సమేతంగా బాబానీమ్ కరోలి ఆశ్రమాన్ని సందర్శించారు. రిషికేశ్ లో స్వామి దయానంద్ ఆశ్రమంలో స్వామి దయానంద్ జీ మహారాజ్ సమాధిని సందర్శించారు.
#WATCH | Madhya Pradesh: Actor Anushka Sharma & Cricketer Virat Kohli visit Mahakaleshwar temple in Ujjain. pic.twitter.com/NKl8etcVGR
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 4, 2023