Shafali Verma : ఏం తాగి వచ్చారా ? షఫాలీ వయస్సుపై నెటిజన్ల రియాక్షన్

టీమిండియా యంగ్ ఉమెన్ క్రికెటర్ షఫాలీ వర్మ..ఏజ్ ఎంత ? మీరు చూపిస్తున్నది ఎంత ? అంటూ నెటిజన్లు ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. షఫాలీ వయస్సు 17 ఏళ్లు అయితే..ఆమెకు 28 ఏళ్లు అన్నట్లుగా సోనీ టెన్ ఛానెల్ టీవీలో డిస్ ప్లే అయ్యింది. ఇది గమనించిన నెటిజన్లు ఛానెల్ ను ఓ ఆట ఆడుకున్నారు.

Bcci

Are They Drunk : టీమిండియా యంగ్ ఉమెన్ క్రికెటర్ షఫాలీ వర్మ..ఏజ్ ఎంత ? మీరు చూపిస్తున్నది ఎంత ? అంటూ నెటిజన్లు ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. షఫాలీ వయస్సు 17 ఏళ్లు అయితే..ఆమెకు 28 ఏళ్లు అన్నట్లుగా సోనీ టెన్ ఛానెల్ టీవీలో డిస్ ప్లే అయ్యింది. ఇది గమనించిన నెటిజన్లు ఛానెల్ ను ఓ ఆట ఆడుకున్నారు. షఫాలీ వయస్సు 17 అయితే.. 28 అని చూపించారు.. ఏం తాగి వచ్చారా..? అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. షఫాలీ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

ఇక షఫాలీ వర్మ విషయానికి వస్తే..ఈమె టీ 20ల్లో దూకుడైన ఆట తీరును కనబరుస్తూ..మంచి పేరు తెచ్చుకున్నారు. షఫాలీ కొంత కాలంగా మంచి ఫాం కనబరుస్తున్నారు. దీంతో బీసీసీఐ (BCCI) ఆమెకు వన్డేల్లో అవకాశం కల్పించింది. టీమిండియా మహిళల జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటన ఉన్న సంగతి తెలిసిందే. ఆదివారం జరుగుతున్న ఈ మ్యాచ్ షఫాలీ వర్మ టీమిండియా తరపున వన్డే క్రికెట్ లో 131వ ఉమెన్ క్రికెటర్ గా అరంగ్రేట్ చేశారు.

టాస్ ఓడిన టీమిండియా జట్టు బ్యాటింగ్ కు దిగింది. 17 ఏళ్ల వయస్సులో షఫాలీ టీమిండియా మహిళల వన్డే జట్టులో చోటు దక్కించుకుని చరిత్ర సృష్టించారు. ఓపెనర్లుగా షఫాలీ వర్మ, స్మృతి మందన క్రీజులోకి వచ్చారు. ఈ మ్యాచ్ ను సోనీ టెన్ ఛానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. షఫాలీ వయస్సు 17 ఏళ్లు అయితే..28 ఏళ్లు అన్నట్లుగా టీవీలో డిస్ ప్లే అయ్యింది. దీంతో నెటిజన్లు స్పందించారు.