FIFA World Cup 2022
FIFA World Cup 2022: ఖతర్‌లో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్-2022 మొదటి సెమీఫైనల్లో క్రొయేషియాను అర్జెంటీనా చిత్తు చేసింది. దీంతో లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా ఫిఫా ప్రపంచ కప్-2022 ఫైనల్ కు దూసుకెళ్లింది. ఆట మొత్తం ఏక పక్షంగా సాగింది. లుసైల్ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్లో ఆది నుంచీ అర్జెంటీనా ఆధిపత్యం కనబర్చింది. అర్జెంటీనా జట్టుకు చెందిన అల్వరెజ్ 2, మెస్సీ ఒక గోల్ చేశారు.
క్రొయేషియా ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. దీంతో క్రొయేషియాపై అర్జెంటీనా 3-0 తేడాతో ఘన విజయం సాధించింది. ప్రపంచ కప్ సెమీఫైనల్ కు అర్జెంటీనా వెళ్లడం ఇది ఆరోసారి. ప్రపంచ కప్ లో సెమీఫైనల్ కు అర్జెంటీనా, క్రొయేషియా, ఫ్రాన్స్, మొరాకో చేరిన విషయం తెలిసిందే. అర్జెంటీనా, క్రొయేషియాలో అర్జెంటీనా గెలుస్తుందని అందరూ భావించారు.
చివరకు అదే నిజమైంది. 2018 ప్రపంచ కప్ ను ఫ్రాన్స్ గెలుచుకోగా, ఆ సమయంలో క్రొయేషియా రన్నరప్ గా నిలిచింది. ఈ సారి సెమీఫైనల్లోనే వెనుతిరిగింది. మెస్సీ సారథ్యంలో అర్జెంటీనా ప్రస్తుత ప్రపంచ కప్ లో అద్భుత విజయాలను నమోదు చేసుకుంది. అర్జెంటీనా 2014 ప్రపంచ కప్ లో రన్నరప్‌గా నిలిచింది. అలాగే, 1986 ప్రపంచ కప్ లో అర్జెంటీనా గెలిచింది.
అయితే, అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ జట్టు మరోసారి ప్రపంచ కప్ గెలుచుకోలేదు. వచ్చే ఆదివారం జరగనున్న ఫైనల్ లో ఆ జట్టు తలపడనుంది. ఇవాళ రాత్రి రెండో సెమీఫైనల్లో ఫ్రాన్స్, మొరాకో ఆడతాయి. గెలిచిన జట్టు వచ్చే ఆదివారం ఫైనల్లో అర్జెంటీనాతో తలపడనుంది. ఫ్రాన్స్, మొరాకో జట్లలో ఫ్రాన్స్ బలంగా ఉంది. ఫైనల్ కు ఫ్రాన్స్ వెళ్లే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
క్వార్టర్ ఫైనల్లో అద్భుతంగా రాణించిన మొరాకో సంచలన విజయాన్ని నమోదుచేసుకుంది. మొరాకో సెమీఫైనల్ లోకి అడుగుపెట్టడం ఇదే తొలిసారి. ఆ జట్టు ఇప్పటివరకు ఒక్క ప్రపంచ కప్ కూడా గెలుచుకోలేదు. ఫ్రాన్స్ రెండు సార్లు, అర్జెంటీనా రెండు సార్లు ప్రపంచ కప్ సాధించాయి.
No words needed. Just enjoy #FIFAWorldCup pic.twitter.com/Krnv5twEur
— Roberto Rojas (@RobertoRojas97) December 13, 2022
IND vs BAN Test Match: నేటి నుంచి బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ మ్యాచ్.. టీమిండియా తుది జట్టు ఇదే..!