×
Ad

Arjun Tendulkar : అతి పెద్ద మైలురాయిని చేరుకున్న అర్జున్ టెండూల్క‌ర్.. అయినా కూడా తండ్రి క‌న్నా చాలా వెనుకే

అర్జున్ టెండూల్క‌ర్ (Arjun Tendulkar) ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో ఓ మైలురాయిని చేరుకున్నాడు

Arjun Tendulkar Achieves Big Milestone In Ranji Trophy

Arjun Tendulkar : టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు స‌చిన్ టెండూల్క‌ర్ కుమారుడు అర్జున్ టెండూల్క‌ర్ ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో ఓ మైలురాయిని చేరుకున్నాడు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండ‌ర్ అయిన అర్జున్ ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్ లో 50 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ప్ర‌స్తుతం గోవాకు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న అర్జున్ మ‌హారాష్ట్ర‌తో మ్యాచ్‌లో ఈ ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు.

2022/23 సీజన్‌లో ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో అర్జున్ టెండూల్క‌ర్ అరంగ్రేటం చేశాడు. గోవా త‌రుపున బ‌రిలోకి దిగి రాజ‌స్థాన్‌పై సెంచ‌రీ చేశాడు. అలాగే ఓ సారి ఐదు వికెట్ల ఘ‌న‌త‌ను కూడా సాధించాడు. ఇక అత‌డు తీసిన 50 వికెట్ల‌లో ఈ సీజ‌న్‌లోనే 13 వికెట్లు తీయ‌డం గ‌మ‌నార్హం.

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ఆస్ట్రేలియా జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. క‌మిన్స్ దూరం, స్టీవ్ స్మిత్‌కు నో ప్లేస్‌..

ఇక అర్జున్ ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో 50 వికెట్లు తీసిన‌ప్ప‌టికి కూడా అత‌డు ఇంకా త‌న తండ్రి స‌చిన్ రికార్డును అందుకోలేదు. స‌చిన్ ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో 71 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అర్జున్ ఇంకా 21 వికెట్ల దూరంలో ఉన్నాడు.

అంతర్జాతీయ స్థాయిలో సచిన్ టెస్ట్ క్రికెట్‌లో 46 వికెట్లు, వన్డేల్లో 154 వికెట్లు కూడా పడగొట్టాడు.

WPL 2026 : గుజ‌రాత్ చేతిలో ఓడిపోయినా.. ప్లేఆఫ్స్‌కు చేరేందుకు ముంబైఇండియ‌న్స్‌కు గోల్డెన్ ఛాన్స్‌!

అర్జున్ దేశీయ క్రికెట్‌లో తనకంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకునే ప‌నిలో ఉన్నాడు. తొలి నాళ్ల‌లో అత‌డు ముంబైకి ఆడ‌గా ఆ త‌రువాత గోవా కు మారాడు. అప్ప‌టి నుంచి అత‌డు మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నాడు. ఐపీఎల్ 2026 వేలానికి ముందు అత‌డు ముంబై నుంచి ట్రేడ్ ద్వారా ల‌క్నోకు వెళ్లాడు.