Arshdeep Singh : చ‌రిత్ర సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్‌.. భార‌త టీ20 క్రికెట్ చ‌రిత్ర‌లో ఒకే ఒక్క‌డు..

టీమ్ఇండియా పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్ చ‌రిత్ర (Arshdeep Singh)సృష్టించాడు. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో భార‌త్ త‌రుపున..

Arshdeep Singh becomes first Indian to reach 100 T20I wickets

Arshdeep Singh : టీమ్ఇండియా పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో భార‌త్ త‌రుపున వంద వికెట్లు తీసిన తొలి బౌల‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. శుక్ర‌వారం అబుదాబి వేదిక‌గా ఒమ‌న్‌తో మ్యాచ్‌లో వికెట్ తీయ‌డం ద్వారా అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh ) ఈ ఘ‌న‌త సాధించాడు.

ఇన్నింగ్స్ చివ‌రి ఓమ‌న్‌లో వినాయ‌క్ శుక్లాను ఔట్ చేసి రికార్డు నెల‌కొల్పాడు. ఈ ఎడ‌మ‌చేతి వాటం పేస‌ర్‌. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో కేవ‌లం 64 మ్యాచ్‌ల్లో 100 వికెట్ల క్ల‌బ్‌లో చేరిపోయాడు. ఈ క్ర‌మంలో అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అతి తక్కువ మ్యాచ్‌ల్లో 100 వికెట్లు సాధించిన ఆట‌గాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ నిలిచాడు. ఈ జాబితాలో అఫ్గాన్ బౌల‌ర్ ర‌షీద్ ఖాన్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. ర‌షీద్ కేవ‌లం 53 మ్యాచ్‌ల్లో 100 వికెట్ల క్ల‌బ్‌లో చేరాడు. ర‌షీద్ త‌రువాత సందీప్ లామిచానె, హ‌స‌రంగా లు ఉన్నారు.

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అతి త‌క్కువ మ్యాచ్‌ల్లో 100 వికెట్లు తీసిన బౌల‌ర్లు వీరే..

* ర‌షీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్‌) – 53 మ్యాచ్‌లు
* సందీప్ లామిచానె (నేపాల్‌) – 54 మ్యాచ్‌లు
* వ‌నిందు హ‌స‌రంగా (శ్రీలంక‌) – 63 మ్యాచ్‌లు
* అర్ష్‌దీప్ సింగ్ (భార‌త్) – 64 మ్యాచ్‌లు

CWC25 anthem : మహిళ‌ల‌ వన్డే ప్రపంచకప్ ఆంథ‌మ్ విన్నారా? ‘బ్రింగ్ ఇట్ హోం..’

తాజా మ్యాచ్‌తో క‌లిపి అర్ష్‌దీప్ సింగ్ ఇప్ప‌టి వ‌ర‌కు 64 మ్యాచ్‌లు ఆడాడు. 8.31 ఎకాన‌మీతో 100 వికెట్లు తీశాడు. ఇందులో రెండు సార్లు నాలుగు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న ఉంది. అత్యుత్తమ ప్రదర్శన 4/9.

ఇదిలాఉంటే.. భార‌త్ త‌రుపున అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా అర్ష్‌దీప్ సింగ్ కొన‌సాగుతున్నాడు. అత‌డి త‌రువాత చాహ‌ల్‌, పాండ్యాలు ఉన్నారు.

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్లు వీరే..

* అర్ష్‌దీప్ సింగ్ – 64 మ్యాచుల్లో – 100 వికెట్లు
* యుజ్వేంద్ర చాహల్ – 80 మ్యాచుల్లో 96 వికెట్లు
* హార్దిక్ పాండ్యా – 117 మ్యాచ్‌ల్లో 96 వికెట్లు
* జస్‌ప్రీత్ బుమ్రా – 72 మ్యాచుల్లో – 92 వికెట్లు
* భువనేశ్వర్ కుమార్ – 87 మ్యాచుల్లో – 90 వికెట్లు

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన‌ టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 188 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో సంజూ శాంస‌న్ (56; 45 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), అభిషేక్‌ శర్మ (38; 15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), తిల‌క్ వ‌ర్మ (29; 18 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స‌ర్లు) మెరుపులు మెరిపించారు. ఒమ‌న్ బౌల‌ర్ల‌లో షా ఫైజల్‌, ఆమిర్‌ కలీమ్‌, జితేన్‌ రామనంది లు త‌లా రెండు వికెట్లు తీశారు.

Mohammad Nabi : మీరు ఒకే ఓవ‌ర్‌లో ఐదు సిక్స‌ర్లు కొట్టిన బౌల‌ర్ తండ్రి చ‌నిపోయాడు అని చెప్ప‌గానే.. న‌బీ రియాక్ష‌న్ ఏంటంటే..?

అనంత‌రం 189 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో ఒమ‌న్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 167 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో భార‌త్ 21 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఒమ‌న్ బ్యాట‌ర్ల‌లో ఆమిర్‌ కలీమ్‌ (64; 46 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), హమ్మద్‌ మీర్జా (51; 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), కెప్టెన్‌ జతిందర్‌ (32; 33 బంతుల్లో 5 ఫోర్లు) రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్‌, హ‌ర్షిత్ రాణా, కుల్దీప్ యాద‌వ్ లు త‌లా ఓ వికెట్ తీశారు.