Arshdeep Singh t20 wickets : టీమ్ఇండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డు సాధించేందుకు అడుగుదూరంలో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా (Arshdeep Singh 100 t20 wickets) చరిత్ర సృష్టించేందుకు కేవలం ఒక్క వికెట్ దూరంలోనే ఉన్నాడు.
సెప్టెంబర్ 9 నుంచి ఆసియాకప్ 2025 ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీలో తొలి మ్యాచ్‌లోనే అతడు ఈ ఘనత సాధించే అవకాశం ఉంది.
వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లోనే అర్ష్‌దీప్ సింగ్ ఈ రికార్డును అందుకోవాల్సి ఉంది. అయితే.. నాటి మ్యాచ్ తుది జట్టులో అతడికి చోటు దక్కలేదు. దీంతో ఈ రికార్డు కోసం అతడు ఇన్నాళ్లు ఆగకతప్పదు.
ప్రస్తుతం అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్ కొనసాగుతున్నాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..
* అర్ష్‌దీప్ సింగ్ – 63 మ్యాచుల్లో – 99 వికెట్లు
* యుజ్వేంద్ర చాహల్ – 80 మ్యాచుల్లో 96 వికెట్లు
* హార్దిక్ పాండ్యా – 114 మ్యాచ్‌ల్లో 94 వికెట్లు
* భువనేశ్వర్ కుమార్ – 87 మ్యాచుల్లో – 90 వికెట్లు
* జస్‌ప్రీత్ బుమ్రా – 70 మ్యాచుల్లో – 89 వికెట్లు
ఆసియా కప్‌లో భారత షెడ్యూల్ ఇదే..
సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. భారత జట్టు తన తొలి మ్యాచ్ సెప్టెంబర్ 10న ఆతిథ్య యూఏఈతో ఆడనుంది. ఈ మ్యాచ్‌లోనే అర్ష్ దీప్ 100 వికెట్ల మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది. ఇక క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 14న జరగనుంది. ఇక లీగ్ దశలో భారత్ తన చివరి మ్యాచ్‌ను సెప్టెంబర్ 19న ఒమన్‌తో ఆడనుంది.