Ashes 2025 AUS vs ENG Australia need 4 wickets to win thrid test against England
AUS vs ENG : యాషెస్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు మూడో టెస్టు మ్యాచ్‌లో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలుపు దిశగా పయనిస్తోంది. 435 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 63 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. జేమ్మీ స్మిత్ (2), విల్ జాక్స్ (11) లు క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ గెలవాలంటే ఇంకా 228 పరుగులు అవసరం కాగా.. ఆసీస్ గెలుపుకు కేవలం 4 వికెట్లు మాత్రమే కావాలి.
భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. నాలుగు పరుగుల వద్దే బెన్ డకెట్ (4) తొలి వికెట్‌గా ఔట్ అయ్యాడు. ఓలీ పోప్ (17), బెన్ స్టోక్స్ (5) లు విఫలం కాగా.. జో రూట్ (39) పర్వాలేదనిపించాడు. ఇంగ్లీష్ బ్యాటర్లలో జాక్ క్రాలీ (85) ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు. ఆసీస్ బౌలర్లలో పాట్ కమిన్స్, నాథన్ లైయాన్‌లు చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
IND vs SA : వామ్మో భారత ఆటగాళ్లు.. సంజూ అంపైర్‌ను, హార్దిక్ కెమెరామన్‌ను.. వీడియోలు..
Australia need four more wickets to retain the urn, with Nathan Lyon and Pat Cummins sharing the honours with the ball.
Day four #Ashes wrap: https://t.co/lwRv8SZdLR pic.twitter.com/PfllT0uCYk
— cricket.com.au (@cricketcomau) December 20, 2025
అంతకముందు నాలుగు వికెట్ల నష్టానికి 271 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ మరో 78 పరుగులు జోడించి మిగిలిన నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 349 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ (170), అలెక్స్ కేరీ (72) రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్ నాలుగు వికెట్లు తీశాడు. బ్రైడన్ కార్స్ మూడు వికెట్లు పడగొట్టాడు. జోఫ్రా ఆర్చర్, విల్‌జాక్స్, బెన్‌స్టోక్స్ తలా ఓ వికెట్ సాధించారు.
మ్యాచ్ సంక్షిప్త స్కోర్లు..
ఆసీస్ తొలి ఇన్నింగ్స్.. 371 ఆలౌట్
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్.. 286 ఆలౌట్
ఆసీస్ రెండో ఇన్నింగ్స్.. 349 ఆలౌట్
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ .. 207/6