Ashes 2025 good news to Australia ahead of second test against England
AUS vs ENG : ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆసీస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక రెండో టెస్టు మ్యాచ్ డిసెంబర్ 4 నుంచి 8 వరకు బ్రిస్బేన్ వేదికగా జరగనుంది.
బ్రిస్బేన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ టెస్టు మ్యాచ్ డే-నైట్ గా జరగనుంది. ఈ పింక్ బాల్ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియాకు రెండు శుభవార్తలు అందాయి. కెప్టెన్ పాట్ కమిన్స్‌తో పాటు పేసర్ జోష్ హేజిల్‌వుడ్‌లు తమ ప్రాక్టీస్‌ను ప్రారంభించారు.
IND vs SA : ట్రిస్టన్ స్టబ్స్ సెంచరీ మిస్.. టీమ్ఇండియా ఎదుట భారీ లక్ష్యం..
తొడ కండరాల గాయంతో బాధపడుతున్న హేజిల్‌వుడ్ సిరీస్‌లోని మొదటి టెస్ట్‌కు దూరమయ్యాడు. అతడు రెండో టెస్ట్ ఆడడం కూడా అనుమానంగానే ఉంది. అయినప్పటికి కూడా అతడు ప్రాక్టీస్ మొదలుపెట్టడంతో యాషెస్‌లోని చివరి మూడు టెస్ట్‌లకు అందుబాటులో ఉంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది.
ఇంకో వైపు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఫిట్‌నెస్ సమస్యల వల్ల గతకొన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. కమిన్స్ పింక్‌బాల్‌తో నెట్స్‌లో శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అతడు రెండో టెస్టులో ఆడడం ఖాయమని అంటున్నారు.
దీనిపై హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ స్పందించాడు. కమిన్స్ రిహాబిలిటేషన్ దాదాపుగా పూర్తి అయినట్లుగా కనిపిస్తోంది. అతడు బౌలింగ్‌లో వేగం, స్థిరత్వం ఉంది. అతడు సానుకూలంగా ఉన్నాడు. యాషెస్ సిరీస్‌లో ఏదో ఒక దశలో అతడు జట్టులో చేరతాడని తెలుసు. అయితే.. అతడిని మ్యాచ్ ఆడే విషయంలో తొందరపెట్టలేము. అతడు పూర్తిగా కోలుకున్న తరువాతనే ఆడతాడు అని చెప్పుకొచ్చాడు.
రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గైర్హాజరీలో ఈ సిరీస్‌లో ఆసీస్‌కు స్టీవ్ స్మిత్ సారథ్యం వహిస్తున్నాడు.