Ashes England announce 12 member squad for fifth Ashes Test
Ashes : యాషెస్ సిరీస్‌లో ఎట్టకేలకు ఓ విజయాన్ని నమోదు చేసిన ఇంగ్లాండ్ అదే ఊపులో ఆఖరి టెస్టు మ్యాచ్ కు సిద్దమైంది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జనవరి 4 నుంచి జరగనున్న ఐదో టెస్టు మ్యాచ్ కోసం 12 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో స్పిన్నర్ షోయబ్ బషీర్‌కు చోటు ఇచ్చింది.
యాషెస్ సిరీస్ (Ashes) ఇప్పటికే ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే.. నాలుగో టెస్టు మ్యాచ్‌లో స్టోక్స్ సేన గెలుపొంది ఆసీస్ ఆధిక్యాన్ని 3-1కి తగ్గించింది. అదే సమయంలో ఆస్ట్రేలియా గడ్డపై దాదాపు 15 ఏళ్ల తరువాత తొలి టెస్టు విజయాన్ని రుచి చూసింది. అదే ఊపులో ఐదో టెస్టులోనూ గెలుపొంది సిరీస్‌ను 3-2తో ముగించాలని ఇంగ్లాండ్ పట్టుదలగా ఉంది.
విల్ జాక్స్ తో పోటీ?
సాధారణంగా సిడ్నీ పిచ్ స్నిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ యాషెస్ సిరీస్‌లో బషీర్ తొలి సారి తుది జట్టులో చోటు దక్కించుకుంటాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా అతడికి ఆల్‌రౌండర్ విల్ జాక్స్‌తో పోటీ ఉంది. ఈ క్రమంలోనే బషీర్ 12వ ఆటగాడిగా చోటు దక్కించుకున్నాడు. మ్యాచ్ రోజు పిచ్‌ను పరిశీలించిన తరువాతే అతడికి తుది జట్టులోకి తీసుకోవాలా వద్దా అనే విషయాన్ని ఇంగ్లాండ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించనున్నట్లు సమాచారం.
➡️ Shoaib Bashir
➡️ Matthew PottsWe’ve named our 12-man squad for the fifth and final Ashes Test against Australia 👇
— England Cricket (@englandcricket) January 2, 2026
ఐదో టెస్టులకు 12 మంది సభ్యులు గల ఇంగ్లాండ్ బృందం ఇదే..
బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలే, బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్ , హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, విల్ జాక్స్, బ్రైడాన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్, మాథ్యూ పాట్స్