Ashutosh Sharma : అశుతోష్ శ‌ర్మ‌.. క‌ష్టాల నుంచి స్టార్ క్రికెట‌ర్‌గా ప్ర‌యాణం..

ఐపీఎల్ 17 సీజ‌న్‌లో వెలుగులోకి వ‌చ్చిన కుర్రాళ్ల‌లో 25 ఏళ్ల అశుతోష్ శ‌ర్మ ఒక‌డు.

Ashutosh Sharma journey through adversity to cricket stardom

ఐపీఎల్ 17 సీజ‌న్‌లో వెలుగులోకి వ‌చ్చిన కుర్రాళ్ల‌లో 25 ఏళ్ల అశుతోష్ శ‌ర్మ ఒక‌డు. ఈ సీజ‌న్‌లో అత‌డి సంచ‌నాల కంటే ముందే యువ‌రాజ్ సింగ్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన ఆట‌గాడిగా కొంత‌మందికి సుప‌రిచ‌త‌మే. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇంగ్లాండ్ పై యువ‌రాజ్ సింగ్ 12 బంతుల్లో అర్థ‌శ‌త‌కం బాగా.. రైల్వేస్ కు ఆడుతూ స‌య్య‌ద్ ముస్తాక్ అలీ 2023 టోర్న‌మెంట్‌లో అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ పై 11 బంతుల్లో అశుతోష్ హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశాడు. దీంతో ప్రాంచైజీ క‌న్ను అత‌డి పై ప‌డింది.

వేలంలో ఐపిఎల్‌లో పంజాబ్ కింగ్స్ అత‌డిని ద‌క్కించుకుంది. జ‌ట్టు మేనేజ్‌మెంట్ త‌న‌పై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని అత‌డు వ‌మ్ముచేయ‌లేదు. ఓ మ్యాచ్‌లో 17 బంతుల్లో 31 ప‌రుగులు చేసి గుజ‌రాత్ టైటాన్స్ తో ఉత్కంఠ‌భ‌రితంగా జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ కు విజ‌యాన్ని అందివ్వ‌గా.. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ పై 15 బంతుల్లో 33 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు.

అశుతోష్ మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో జన్మించాడు. అయితే.. క్రికెట్ కోచింగ్ కోసం అత‌డు 8 ఏళ్ల వ‌యసులో ర‌త్లాంను విడిచిపెట్టి ఇండోర్‌కు వెళ్లాడు. 10 ఏళ్ల వ‌య‌సులో త‌న వ‌ద్ద డ‌బ్బులు లేవ‌ని, పూట ఎలా గ‌డుస్తుందో త‌న‌కు తెలియ‌న్నాడు. ఓ చిన్న గ‌దిలో నివ‌సించేవాడిన‌ని తెలిపాడు. కొంచ‌మైనా డ‌బ్బులు సంపాదించుకునేందుకు అంపైరింగ్ సైతం చేసిన‌ట్లు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ అశుతోష్ చెప్పాడు.

Sunil Gavaskar : అత‌డిపై ఓ క‌న్నేసి ఉంచండి.. 15 ఇన్నింగ్స్‌ల్లో 10 హాఫ్ సెంచ‌రీలు.. : సునీల్ గ‌వాస్క‌ర్‌

MPCA అకాడమీలో 12 ఏళ్ల వ‌య‌సులో తాను ప్రాక్టీస్ చేస్తుండ‌గా త‌నలోని ప్ర‌తిభ‌ను అతడి చిన్ననాటి కోచ్ అమయ్ ఖురాసియా గుర్తించిన‌ట్లు చెప్పాడు. చిన్న‌ప్ప‌టి నుంచి అత‌డు ఎంతో సాయం చేశాడు. మాన‌సిక ఆరోగ్యం గురించి చాలా చిట్కాలు తీసుకున్నాను. ఐపీఎల్‌కు ముందు కూడా అత‌డితో క‌లిసి ప్రాక్టీస్ చేశాను. ప్ర‌తిసారీ మ్యాచ్‌కు ముందు అత‌డితో మాట్లాడ‌తాను అని అశుతోష్ తెలిపాడు.

అవి చీక‌టి రోజులు..

2019లో జ‌రిగిన ఓ చివ‌రి మ్యాచ్‌లో మ‌ధ్య‌ప్ర‌దేశ్ త‌రుపున ముస్తాక్ అలీ టోర్న‌మెంట్‌లో 84 ప‌రుగులు చేశాను. అయితే.. ఆ మ‌రుస‌టి సంవ‌త్స‌రం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు ఓ ప్రొపెష‌న‌ల్ వ‌చ్చాడని చెప్పాడు. అత‌డికి ఎందుక‌నో తాను అంటే ఇష్టం లేద‌న్నాడు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ కోసం జ‌ట్టును ఎంపిక చేసేందుకు ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించ‌గా తాను 45 బంతుల్లో 90 ప‌రుగులు చేశాను. అయితే.. ఆ రోజు సాయంత్రం 2020 ముస్తాక్ టోర్నీలో నా పేరు లేదు అని తెలుసుకుని ఎంతో బాధ‌ప‌డిన‌ట్లు చెప్పాడు.

“ముస్తాక్ అలీ సీజన్‌కు ముందు నేను ఆరు గేమ్‌లు ఆడాను. మూడు అర్ధ సెంచరీలు సాధించాను. అయిన‌ప్ప‌టికీ ప్రొఫెషనల్ కోచ్ నన్ను ఎంపిక చేయ‌లేదు. అది కోవిడ్ సమయం కావ‌డంతో కేవ‌లం 20 మంది ఆటగాళ్ళు ప్రయాణించేవారు. నన్ను గ్రౌండ్‌కి వెళ్లడానికి అనుమతించలేదు. నేను హోటల్‌లో ఉండేవాడిని జిమ్‌కి వెళ్లి తిరిగి హోటల్ గదికి వచ్చేవాడిని. ఆ సమయంలో నేను పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను . నేను చేసిన త‌ప్పులు ఏమిటి? ఎందుకు జ‌ట్టుకు దూరం అయ్యాను. అని అలోచిస్తూ డిప్రెష‌న్‌లో కూరుకుపోయాను. నా జీవితంలో ఆ రెండు మూడేళ్లు న‌ర‌కంలా అనిపించింది. రాత్రిళ్లు నిద్ర కూడా ప‌ట్టేది కాదు. ఏమీ జ‌రుగుతుందోన‌ని ఆలోచిస్తూ ఉండేవాడిని అని అశుతోష్ తెలిపాడు.

రైల్వేలో ఉద్యోగం.. ఆశ చిగురించింది..

ఎంత బాధఉన్న‌ప్ప‌టికీ చ‌దువును నిర్ల‌క్ష్యం చేయ‌లేదు. అదృష్ట‌వ‌శాత్తు రైల్వేలో ఉద్యోగం వ‌చ్చింది. అది నా జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. రైల్వే న‌న్ను ఆద‌రించింది. గ‌త సంవ‌త్స‌రం నాకు టీ20ల్లో అవ‌కాశం వ‌చ్చింది. రైల్వేస్ త‌రుపున ముస్తాక్ అలీ టోర్నీలో రాణించ‌న‌ట్లు అశుతోష్ అన్నాడు.

Rajasthan Royals : రాజ‌స్థాన్‌కు షాకిచ్చిన ఆడ‌మ్ జంపా.. ఐపీఎల్ నుంచి త‌ప్పుకోవ‌డానికి కార‌ణ‌మ‌దే?