Virender Sehwag : అశ్విన్ పై సెహ్వాగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

స్టార్ బౌల‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ మాత్రం నిరాశ‌ప‌రుస్తున్నాడు.

Virender Sehwag – Ravichandran Ashwin : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ అద‌ర‌గొడుతోంది. పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది. అయితే.. ఆ జ‌ట్టు స్టార్ బౌల‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ మాత్రం నిరాశ‌ప‌రుస్తున్నాడు. ఎనిమిది మ్యాచులు ఆడినా కేవ‌లం రెండు వికెట్లు మాత్ర‌మే ప‌డ‌గొట్టాడు. ఈ క్ర‌మంలో టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్‌ వేలంలో అశ్విన్ అమ్ముడుపోక‌పోవ‌చ్చున‌ని అన్నాడు.

క్రిక్‌బ‌జ్‌తో సెహ్వాగ్ మాట్లాడుతూ.. ప‌రుగులు చేస్తున్న‌ప్పుడు స్ట్రైక్‌రేటుతో సంబంధం లేద‌ని కేఎల్ రాహుల్ గ‌తంలో చెప్పిన విష‌యాన్ని గుర్తు చేశాడు. అది అశ్విన్ విష‌యంలోనూ వ‌ర్తిస్తుంద‌న్నాడు. అయితే.. వికెట్లు తీసిన‌ప్పుడు మాత్ర‌మే అలా కుదురుతుంద‌న్నాడు. అత‌డి గ‌ణాంకాలు స‌రిగా లేవ‌న్నాడు. ఇలాగే ఉంటే వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌బోయే వేలంలో అత‌డిని ఎవ‌రూ తీసుకోక‌పోవ‌చ్చున‌ని, అన్‌సోల్డ్‌గా మిగిలిపోవ‌డం ఖాయ‌మ‌న్నాడు.

T20 World Cup 2024 : హార్దిక్ పాండ్య‌కు షాక్‌? వైస్ కెప్టెన్‌గా పంత్‌?

ఏ ప్రాంఛైజీ అయినా కూడా ఒక బౌల‌ర్ 25 నుంచి 30 ప‌రుగులు కంటే ఎక్కువ‌గా ఇవ్వ‌కుండా వికెట్లు తీయాల‌ని ఆశిస్తుంద‌ని చెప్పాడు. ప్ర‌స్తుత సీజ‌న్‌లో అశ్విన్‌, కుల్దీప్ యాద‌వ్ ఆక‌ట్టుకుంటున్నార‌న్నాడు. అశ్విన్ ఆఫ్ స్పిన్ వ‌ర్కౌట్ కావ‌డం లేద‌న్నారు. అత‌డు క్యార‌మ్ బౌలింగ్ ఎందుకు చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించాడు. గ‌తంలో చాలా సంద‌ర్భాల్లో అత‌డు దూస్త్రాలు వేసి వికెట్లు ప‌డ‌గొట్టాడ‌న్నాడు.

బౌలింగ్ పై న‌మ్మ‌కం స‌న్న‌గిల్లిన‌ప్పుడే ఇలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌న్నాడు. ఒక‌వేళ తానే మెంటార్ అయి ఉంటే జ‌ట్టులో ఎవ‌రైనా వికెట్లు తీయ‌డం కంటే ప‌రుగులు నియంత్రించ‌డం పై దృష్టి పెడితే వారికి జ‌ట్టులో మ‌ళ్లీ అవ‌కాశం ఇవ్వ‌న‌ని చెప్పుకొచ్చాడు.

Thomas Uber Cup : థామ‌స్ ఉబెర్ క‌ప్‌లో భార‌త జోరు.. ఇంగ్లాండ్ పై 5-0 ఆధిక్యం.. క్వార్ట‌ర్ ఫైన‌ల్‌లోకి అడుగు

ట్రెండింగ్ వార్తలు