Thomas Uber Cup : థామ‌స్ ఉబెర్ క‌ప్‌లో భార‌త జోరు.. ఇంగ్లాండ్ పై 5-0 ఆధిక్యం.. క్వార్ట‌ర్ ఫైన‌ల్‌లోకి అడుగు

డిఫెండింగ్ ఛాంపియ‌న్ భార‌త్ ప్ర‌తిష్టాత్మ‌క థామ‌స్ ఉబెర్ క‌ప్‌లో అద‌ర‌గొడుతోంది.

Thomas Uber Cup : థామ‌స్ ఉబెర్ క‌ప్‌లో భార‌త జోరు.. ఇంగ్లాండ్ పై 5-0 ఆధిక్యం.. క్వార్ట‌ర్ ఫైన‌ల్‌లోకి అడుగు

Photo Credit @BAI_Media

డిఫెండింగ్ ఛాంపియ‌న్ భార‌త్ ప్ర‌తిష్టాత్మ‌క థామ‌స్ ఉబెర్ క‌ప్‌లో అద‌ర‌గొడుతోంది. వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని సాధించి నాకౌట్ ద‌శ‌కు చేరుకుంది. థామ్‌లాండ్‌ను 4-1తో చిత్తు చేసిన భార‌త్ సోమ‌వారం ఇంగ్లాండ్ ను 5-0తో ఓడించి క్వార్ట‌ర్ ఫైన‌ల్‌కు దూసుకువెళ్లింది. మొద‌ట‌గా హెచ్ఎస్ ప్ర‌ణ‌య్ హ్యారీ హువాంగ్‌ను 21-15 21-15తో ఓడించి భార‌త్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు.

ఆ త‌రువాత కిదాంబి శ్రీకాంత్ 21-16, 21-11తో న‌దీమ్ డ‌ల్వీ పై వ‌రుస సెట్ల‌ల‌తో విజ‌యం సాధించాడు. ఇక‌ డ‌బుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్‌, చిరాగ్ శెట్టి జంట 21-17 19-21 21-15 తో ఇంగ్లాండ్ స్టార్ జోడి బెన్ లేన్- సీన్ వెండీ ఓడించడంతో భార‌త్ 3-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.

Kaviya Maran : ‘అయ్యో భ‌గ‌వంతుడా..?’ అంటూ కావ్యా పాప రియాక్ష‌న్.. ఇలా చేస్తార‌ని అనుకోలేదు!

అనంత‌రం రెండవ డ‌బుల్స్‌లో ఎంఆర్ అర్జున్‌, ధృవ్ క‌పిల 21-17 21-19తో రోరీ ఈస్టన్, అలెక్స్ గ్రీన్‌లను ఓడించగా.. ఫైనల్ మ్యాచ్‌లో 24 ఏళ్ల కిరణ్ జార్జ్ 21-18 21-12తో చోలన్ కయాన్‌పై విజయం సాధించ‌డంతో 5-0 ఆధిక్యంతో భార‌త్ విజ‌యాన్ని అందుకుని క్వార్ట‌ర్ ఫైన‌ల్‌లో అడుగుపెట్టింది.

భార‌త జ‌ట్టు బుధ‌వారం క్వార్ట‌ర్ ఫైన‌ల్‌లో రికార్డు స్థాయిలో 14 సార్లు ఛాంపియ‌న్ అయిన ఇండోనేషియాతో త‌ల‌ప‌డ‌నుంది.

Virat Kohli : 500 ప‌రుగుల మైలురాయిని చేరుకున్న కోహ్లి.. డేవిడ్ వార్న‌ర్ రికార్డు స‌మం