Ashwin Needs 14 Wickets To Break Nathan Lyons Record Of Most Wickets In WTC
IND vs BAN – Ravichandran Ashwin : సెప్టెంబర్ 19 నుంచి భారత జట్టు బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడనుంది. బంగ్లాదేశ్‌ను ఓడించి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్తు అవకాశాలను మరింత మెరుగుపరచుకోవాలని భారత్ భావిస్తోంది. అదే సమయంలో టీమ్ఇండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఓ ప్రపంచ రికార్డు ఊరిస్తోంది.
బంగ్లాదేశ్ సిరీస్‌లో గనుక అశ్విన్ మరో 14 వికెట్లు సాధిస్తే.. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లైయన్ ఉన్నాడు. 43 టెస్టుల్లో లైయన్ 187 వికెట్లు తీశాడు. పాట్ కమిన్స్ 42 టెస్టుల్లో 175 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. అశ్విన్ 35 మ్యాచుల్లో 174 వికెట్లు తీసి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
భారత్‌లోని పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తాయని, అశ్విన్ ఈ రికార్డును సునాయాసంగా అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదండోయ్ ఒకవేళ 26 వికెట్లు గనుక అశ్విన్ సాధించగలిగితే.. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలుస్తాడు. ఇక అశ్విన్ ఇప్పటి వరకు 100 టెస్టులు ఆడాడు. 516 వికెట్లు తీశాడు.
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు మ్యాచ్ సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదికగా జరగనుంది. రెండో టెస్టు మ్యాచ్ సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా జరగనుంది. ఇక బీసీసీఐ ఇప్పటికే తొలి టెస్టుకు జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ బరిలోకి దిగనుంది.
బంగ్లాతో మొదటి టెస్ట్‌కు భారత జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, రిషబ్ పంత్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్‌దీప్, యశ్ దయాల్, జస్ప్రీత్ బుమ్రా