Ravichandran Ashwin
Ravichandran Ashwin : ఐసీసీ తాజాగా విడుదల చేసిన పురుషుల టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో టీమిండియా ప్లేయర్, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (870 పాయింట్లతో) అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. ఇండియా వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో అశ్విన్ అద్భుత బౌలింగ్ తో ఇంగ్లాండ్ జట్టు ఓటమిలో కీలక భూమిక పోషించాడు. ఈ సిరీస్ లో అశ్విన్ మొత్తం 26 వికెట్లు తీసుకున్నాడు. రాజ్ కోటలో జరిగిన మూడో టెస్టులో అశ్విన్ 500 టెస్ట్ వికెట్ల మైలురాని సాధించిన విషయం తెలిసిందే. ఈ ఘనత సాధించిన రెండో భారతీయ బౌలర్ అశ్విన్ కావటం గమనార్హం. టీమిండియా మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే భారత్ దేశం నుంచి టెస్టుల్లో 500 వికెట్లు తీసిన మొదటి బౌలర్ గా రికార్డుకెక్కాడు.
Also Read : MS Dhoni : మహేంద్ర సింగ్ ధోనీ ఆటోగ్రాఫ్ కోసం యువకులు ఏం చేశారో తెలుసా?.. వీడియో వైరల్
ఐసీసీ పురుషుల టెస్ట్ ర్యాంకింగ్స్ విభాగంలో టీమిండియా పాస్ట్ బౌలర్ జస్ర్పిత్ బుమ్రా ఇటీవలి వరకు మొదటి స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం 834 పాయింట్లతో మూడో స్థానంకు పడిపోయాడు. ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ (847 పాయింట్లతో) రెండో స్థానంలో నిలిచాడు. బౌలింగ్ విభాగంలో టాప్ -10లో ముగ్గురు భారతీయ బౌలర్లు నిలిచారు. అశ్విన్ అగ్రస్థానంకు దూసుకెళ్లగా.. జస్ర్పీత్ బుమ్రా మూడో స్థానంలో నిలిచాడు. రవీంద్ర జడేజా ఏడో స్థానంలో నిలిచాడు.
Also Read : రోహిత్ శర్మలో అద్భుతమైన నాయకుడిని చూశాను.. ఆరోజు జరిగిన ఘటనను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయిన అశ్విన్
టెస్ట్ బ్యాటింగ్ విభాగంలో న్యూజిలాండ్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ మొదటి స్థానంలోకి దూసుకెళ్లాడు. ఈ విభాగంలో భారత్ బ్యాటర్లు ముగ్గురు టాప్ -10లో ఉన్నారు. రోహిత్ శర్మ ఆరో స్థానంలో, జైస్వాల్ ఎనిమిదో స్థానంలో, కోహ్లీ తొమ్మిదో స్థానంలో నిలిచారు.
RAVICHANDRAN ASHWIN BECOMES THE NUMBER 1 RANKED TEST BOWLER IN THE WORLD ?
– The GOAT is back….!!!! pic.twitter.com/2t5pom0vOA
— Johns. (@CricCrazyJohns) March 13, 2024