ban Vs sl
Asia Cup 2023 – BAN Vs SL: ఆసియా కప్-2023లో శ్రీలంక బోణీ కొట్టింది. బంగ్లాదేశ్ పై విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. మరో 66 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ పై గెలుపొందింది శ్రీలంక. లంక బ్యాటర్లలో సదీర సమరవిక్రమ(54), చరిత్ అసలంక(62-నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.
రాణిస్తున్న మిడిల్ ఆర్డర్
బంగ్లాదేశ్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో శ్రీలంక టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు నిలకడగా రాణిస్తున్నారు. 27 ఓవర్ల వద్ద శ్రీలంక స్కోరు 117/3గా ఉంది. క్రీజులో సదీర సమరవిక్రమ(54), చరిత్ అసలంక(34) ఉన్నారు.
శ్రీలంక టార్గెట్ 165
శ్రీలంక ముందు బంగ్లాదేశ్ 165 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. శ్రీలంక బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ బ్యాటర్లు క్రీజులో నిలబడలేకపోయారు. 42.4 ఓవర్ వద్ద 164 పరుగులకే బంగ్లా కుప్పకూలింది.
స్కోరు 33 ఓవర్లకు 127/5
బంగ్లా స్కోరు 33 ఓవర్లకు 127/5గా ఉంది.
నజ్ముల్ హాఫ్ సెంచరీ
బంగ్లాదేశ్ స్కోరు 25 ఓవర్లకు 96/4గా ఉంది. నజ్ముల్ హుస్సేన్ శాంటో హాఫ్ సెంచరీ బాదాడు. క్రీజులో నజ్మల్, రహీం ఉన్నారు.
షకీబ్ ఔట్
బంగ్లా బ్యాటర్ షకీబ్ అల్ హసన్ 5 పరుగులు చేసి ఔటయ్యాడు. బంగ్లా స్కోరు 11 ఓవర్ల వద్ద 37/3గా ఉంది.
రెండో వికెట్ డౌన్
బంగ్లా బ్యాటర్ మహ్మద్ నయీమ్ 16 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో షాకిబ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో ఉన్నారు. బంగ్లా స్కోరు 8 ఓవర్లకు 27/2గా ఉంది.
ఆదిలోనే ఎదురుదెబ్బ
బంగ్లాదేశ్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంక ఆటగాడు మహీశ్ తీక్షణ బౌలింగ్ లో బంగ్లా ఓపెనర్ తాంజిద్ హసన్ డకౌట్ అయ్యాడు.
జట్ల వివరాలు
బంగ్లాదేశ్ జట్టు: మహ్మద్ నయీమ్, తాంజిద్ తమీమ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), మెహెదీ హసన్, మహేదీ హసన్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్
శ్రీలంక జట్టు: పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక (కెప్టెన్), దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, మతీశ పతిరాణ
Asia Cup 2023: ఆసియా కప్ మాత్రమే కాదు.. వన్డే ప్రపంచ కప్ మ్యాచులూ ఫ్రీగా చూడొచ్చు..