Asia Cup 2025 Abhishek Sharma Creates History Breaks Kohli Record
Asia Cup 2025 : టీమ్ఇండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో పాకిస్తాన్ పై పవర్ ప్లేలో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఆసియాకఫ్ 2025లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.
128 పరుగుల లక్ష్య ఛేదనలో అభిషేక్ దంచికొట్టాడు. కేవలం 13 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 31 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతడు టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించాడు. టీ20 క్రికెట్‌లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా అభిషేక్ శర్మ రికార్డులకు ఎక్కాడు. 2022లో కోహ్లీ పాక్ పై పవర్ ప్లేలో 29 పరుగులు చేశాడు.
టీ20 క్రికెట్‌లో పాక్ పై పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు..
* అభిషేక్ శర్మ – 31 పరుగులు (2025లో దుబాయ్ వేదికగా)
* విరాట్ కోహ్లి – 29 పరుగులు (2022లో దుబాయ్ వేదికగా)
* రోహిత్ శర్మ – 28 పరుగులు (2022లో దుబాయ్ వేదికగా)
* కేఎల్ రాహుల్ – 28 పరుగులు (2022లో దుబాయ్ వేదికగా)
* అజింక్యా రహానే – 25 పరుగులు (2012లో అహ్మదాబాద్ వేదికగా)
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో సాహిబ్‌జాదా ఫర్హాన్ (40), షహీన్ షా అఫ్రిది (33 నాటౌట్) రాణించారు. మిగిలిన వారు విఫలం కావడంతో పాక్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. టీమ్ఇండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, బుమ్రా చెరో రెండు వికెట్లు సాధించారు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలు తలా ఓ వికెట్ సాధించారు.
IND vs PAK : పాక్‌పై భారత్ ఘన విజయం.. గంభీర్ ఏమన్నాడో తెలుసా?
అనంతరం సూర్యకుమార్ యాదవ్ (47 నాటౌట్), అభిషేక్ శర్మ (31 పరుగులు), తిలక్ వర్మ (31 పరుగులు) రాణించడంతో లక్ష్యాన్ని భారత్ 15.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది.