Asia cup 2025 Abhishek Sharma Run Out vs Bangladesh Sunil Gavaskar Minces No Words
Sunil Gavaskar : ఆసియాకప్ 2025లో టీమ్ఇండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అదరగొడుతున్నాడు. బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో 35 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ 202.70 స్ట్రైక్‌రేటుతో 6 ఫోర్లు, 5 సిక్సర్లు బాది 75 పరుగులు సాధించాడు.
అయితే.. సెంచరీకి చేరువవుతున్న క్రమంలో దురదృష్టవశాత్తు అభిషేక్ శర్మ రనౌట్ అయ్యాడు. తన తొందరపాటు చర్య కారణంగానే అతడు పెవిలియన్‌కు చేరుకున్నాడు.
Kuldeep Yadav : చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్.. ఆసియాకప్‌లో ఒకే ఒక భారత బౌలర్..
ఇన్నింగ్స్ 12వ ఓవర్‌ను ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేశాడు. ఈ ఓవర్‌లోని తొలి బంతిని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాక్ వర్డ్ పాయింట్ దిశగా షాట్ ఆడాడు. అయితే.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రిషద్ హుస్సేన్ చాలా వేగంగా స్పందించాడు. డైవ్ చేస్తూ బంతిని ఆపాడు. ఆ సమయంలో సింగిల్ కోసం అభిషేక్ శర్మ నాన్ స్ట్రైకింగ్ ఎండ్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఫీల్డర్ బంతిని ఆపడం చూసి సూర్య.. అభిషేక్‌ను వెనక్కి వెళ్లమని చెప్పాడు.
Abhishek Sharma’s whirlwind knock halted by brilliance in the field 🫣
Watch #INDvBAN LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/2NsKpa8FLg
— Sony Sports Network (@SonySportsNetwk) September 24, 2025
అయితే.. అప్పటికే చాలా దూరం వచ్చిన అభిషేక్ మళ్లీ నాన్ స్ట్రైకింగ్ ఎండ్ వైపు పరిగెత్తాడు. అదే సమయంలో హుస్సేన్ వేగంగా బంతిని బౌలర్ ముస్తాఫిజుర్ కు త్రో చేశాడు. వెంటనే అతడు బంతిని అందుకుని వికెట్లను పడగొట్టాడు. అభిషేక్ డైవ్ చేసినప్పటికి కూడా ఫలితం లేకపోయింది.
Abhishek Sharma : బంగ్లాదేశ్‌ను చితక్కొట్టడానికి కారణం అదే.. అభిషేక్ శర్మ కామెంట్స్..
దీంతో అభిషేక్ 75 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. దీన్ని చూసిన మైదానంలోని ప్రేక్షకులతో పాటు అభిషేక్ సోదరి కోమల్ కూడా తీవ్ర నిరాశకు గురైంది.
కాగా.. ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) దీన్ని చూసి మండిపడ్డాడు. అభిషేక్‌ది తొందరపాటు చర్య అని అన్నాడు. అసలు అక్కడ పరుగు తీయాల్సిన అవసరం లేదన్నాడు. ‘సింగల్ తీసే ఆస్కారమే లేదు. అయినా అభిషేక్ రిస్క్ చేశాడు. అసలు అక్కడ ఏం ఉంది? ‘ అని గవాస్కర్ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. అభిషేక్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అనంతరం 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Jaker Ali : అందుకే భారత్ పై ఓడిపోయాం.. లేదంటేనా.. బంగ్లాదేశ్ కెప్టెన్ జాకీర్ అలీ కామెంట్స్..
ఈ గెలుపుతో భారత్ ఆసియాకప్ 2025 ఫైనల్ లో అడుగుపెట్టింది. ఇక సూపర్-4లో భాగంగా శుక్రవారం శ్రీలంకతో భారత్ తలపడనుంది. ఇప్పటికే లంక జట్టు ఆసియాకప్ నుంచి నిష్ర్కమించడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగానే మారింది. సెప్టెంబర్ 28 ఆదివారం ఫైనల్ మ్యాచ్ ఉండడంతో అందుకు ఈ మ్యాచ్‌ను ప్రాక్టీస్‌గా భారత్ ఊపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి.