Asia cup 2025: అదరగొట్టిన అఫ్గాన్.. అటల్, అజ్మతుల్లా బౌండరీల మోత.. హాంకాంగ్‌పై ఘన విజయం

Asia cup 2025: ఆసియా కప్ టీ20 టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ అఫ్గానిస్తాన్ వర్సెస్ హాంకాంగ్ జట్ల మధ్య జరిగింది.

Asia cup 2025

Asia cup 2025: ఆసియా కప్ టీ20 టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ మంగళవారం రాత్రి జరిగింది. అఫ్గానిస్తాన్ వర్సెస్ హాంకాంగ్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో రాణించారు. దీంతో అఫ్గానిస్థాన్ జట్టు ఘన విజయంతో ఆసియా కప్ టోర్నీని మొదలు పెట్టింది.

Also Read: IND vs PAK : సెప్టెంబ‌ర్ 14న పాక్‌తో మ్యాచ్‌.. టీమ్ఇండియా తుది జ‌ట్టులో చోటు ద‌క్కేది ఎవ‌రికంటే?

ఆసియా కప్ టోర్నీలో భాగంగా గ్రూప్ -బి తొలి మ్యాచ్‌లో అఫ్గాన్, హాంకాంగ్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ సాదిఖుల్లా అటల్ ఆరు ఫోర్లు, మూడు సిక్సులతో 52 బంతుల్లో 73 (నాటౌట్) పరుగులు చేశాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ 21 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ముఖ్యంగా అజ్మతుల్లా 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకొని అఫ్గాన్ తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. హాంకాంగ్ బౌలర్లలో కించిత్ షా, ఆయుశ్ శుక్లా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్ బ్యాటర్లు పరుగులు రాబట్టడంలో విఫలమయ్యారు. అఫ్గాన్ బౌలర్లు సమష్టిగా సత్తా చాటడంతో హాంకాంగ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 94 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టులో బాబర్ హయత్ (39 పరుగులు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో హాంకాంగ్‌ జట్టుపై అఫ్గాన్ 94 పరుగుల తేడాతో విజయం సాధించింది.

హాంకాంగ్‌ తమ తర్వాతి మ్యాచ్‌లో 11న బంగ్లాదేశ్‌తో.. అఫ్గానిస్తాన్‌ తమ తర్వాతి మ్యాచ్‌లో 16న బంగ్లాదేశ్‌తో తలపడతాయి.