×
Ad

IND vs BAN : భార‌త్‌తో మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. స్టార్ ఆట‌గాడికి గాయం..!

బుధ‌వారం భార‌త జ‌ట్టుతో దుబాయ్ వేదిక‌గా బంగ్లాదేశ్ త‌ల‌ప‌డాల్సి ఉంది (IND vs BAN). ఈ స‌మ‌యంలో ఆ జ‌ట్టుకు భారీ షాక్ త‌గిలింది.

Asia Cup 2025 IND vs BAN Injury scare for Bangladesh ahead of India game

IND vs BAN : ఆసియాక‌ప్ 2025 సూప‌ర్‌-4లో భాగంగా బుధ‌వారం దుబాయ్ వేదిక‌గా భార‌త్, బంగ్లాదేశ్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ కీల‌క మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్ జ‌ట్టుకు భారీ షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు కెప్టెన్ లిట‌న్ దాస్ వెన్నునొప్పితో బాధ‌ప‌డుతున్నాడు. ఈ నేప‌థ్యంలో అత‌డు టీమ్ఇండియాతో మ్యాచ్‌లో ఆడ‌తాడో లేదో అన్న సందిగ్ధం నెల‌కొంది.

భార‌త్‌తో మ్యాచ్ కోసం (IND vs BAN) సోమ‌వారం బంగ్లాదేశ్ జ‌ట్టు ఐసీసీ అకాడ‌మీలో ప్రాక్టీస్ సెష‌న్‌లో పాల్గొంది. లిట‌న్ దాస్ నెట్స్‌లో స్క్వేర్ క‌ట్ షాట్ ఆడేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ప్పుడు అత‌డి న‌డుము ఎడ‌మ వైపు తీవ్ర అసౌక‌ర్యానికి గురి అయ్యాడు. వెంట‌నే ఫిజియో అత‌డిని ప‌రీక్షించాడు. ఆత‌రువాత లిట‌న్ దాస్ నెట్స్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడు.

Team India : భార‌త్‌కు ఐసీసీ బిగ్ షాక్‌.. భారీ జ‌రిమానా..

‘అత‌డు బ‌య‌ట నుంచి చూడ‌డానికి బాగానే క‌నిపిస్తున్నాడు. అత‌డిని వైద్యులు ప‌రీక్షించ‌నున్నారు. వారు ఇచ్చే సూచ‌న‌ల ఆధారంగానే లిట‌న్ పై ఓ తుది నిర్ణ‌యానికి వ‌స్తాం.’ అని ఓ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారి తెలిపిన‌ట్లు క్రికెట్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

గాయం తీవ్ర‌మైన‌ది అయి భార‌త్‌తో మ్యాచ్‌కు లిట‌న్ దూరం అయితే మాత్రం అది బంగ్లాదేశ్ జ‌ట్టుకు పెద్ద ఎదురు దెబ్బ‌గానే చెప్ప‌వ‌చ్చు. బంగ్లా క్రికెట్ బోర్డు ఆసియాక‌ప్ 2025కు వైస్ కెప్టెన్‌గా ఎవ‌రిని నియ‌మించ‌లేదు. ఒక‌వేళ లిట‌న్ దూరం అయితే అప్పుడు జ‌ట్టుకు ఎవ‌రు నాయ‌క‌త్వం వ‌హిస్తారు అన్నది ఇంకా తెలియ‌రాలేదు.

Shahid Afridi : ఫ‌క‌ర్ జ‌మాన్ ఔట్ వివాదం.. మ‌ధ్య‌లో ఐపీఎల్‌ను లాగి మ‌రీ భార‌త్ పై షాహిద్ అఫ్రిది అక్క‌సు..

ఆసియాక‌ప్ 2025లో గ్రూప్ స్టేజీలో ఓ మోస్త‌రు ప్ర‌ద‌ర్శ‌న చేసిన బంగ్లాదేశ్ సూప‌ర్ 4లో మాత్రం అద‌ర‌గొట్టింది. శ్రీలంక జ‌ట్టును ఓడించి భార‌త్‌తో మ్యాచ్‌కు ఆత్మ‌విశ్వాసాన్ని ప్రోదిచేసుకుంది.