IND vs PAK : భార‌త్‌తో అట్టుంట‌ది మ‌రి.. పాక్ కెప్టెన్ మైండ్ బ్లాక్‌.. దెబ్బ‌కు ముఖం చాటేశాడు.

ఓ వైపు పాక్ ఆటగాళ్లు మైదానంలో (IND vs PAK) క‌ర‌చాల‌నం కోసం వేచి చూస్తుండ‌గా భార‌త ఆట‌గాళ్లు త‌మ డ్రెస్సింగ్ రూమ్ డోర్‌ను క్లోజ్ చేశారు.

Asia cup 2025 IND vs PAK Pakistan Captain Skipped Post Match Presentation Ceremony

IND vs PAK : ఆసియాక‌ప్ 2025లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో పాక్ పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. ప‌హ‌ల్గామ్‌లో ఉగ్ర‌దాడి, దానికి ప్ర‌తిస్పంద‌న‌గా భారత సైన్యం ఆప‌రేష‌న్ సింధూర్ త‌రువాత ఇరు దేశాల మ‌ధ్య జ‌రిగిన తొలి మ్యాచ్ ఇది.

సాధార‌ణంగా క్రికెట్‌లో మ్యాచ్ ముగిసిన త‌రువాత ఇరు జ‌ట్ల ఆట‌గాళ్లు క‌ర‌చాల‌నం చేసుకుంటారు అన్న సంగ‌తి తెలిసిందే. అయితే.. మ్యాచ్ గెలిచిన త‌రువాత భార‌త జ‌ట్టు పాక్‌( IND vs PAK )తో క‌ర‌చాల‌నం చేసేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు. మ్యాచ్ గెల‌వ‌గానే దూబేతో క‌లిసి సూర్య భార‌త డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు.

IND vs PAK : ఆసియాక‌ప్‌లో పాక్‌కు ఘోర అవ‌మానం..! ఇంకా.. క‌ర‌చాల‌నాల్లేవు..

ఓ వైపు పాక్ ఆటగాళ్లు మైదానంలో క‌ర‌చాల‌నం కోసం వేచి చూస్తుండ‌గా భార‌త ఆట‌గాళ్లు త‌మ డ్రెస్సింగ్ రూమ్ డోర్‌ను క్లోజ్ చేశారు. టీమ్ఇండియా నుంచి వ‌చ్చిన ఈ క‌ఠినమైన సందేశం త‌రువాత పాక్ కెప్టెన్ స‌ల్మాన్ అగా ఏమీ చేయ‌లేక‌పోయాడు. అయితే.. ఆ త‌రువాత అత‌డు ప్రెజెంటేషన్ వేడుక కోసం అత‌డు రాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఘోర ఓట‌మి, ఇంకా సూర్య చేసిన ప‌నికి పాక్ కెప్టెన్ క‌ల‌త చెంది ఉంటాడ‌ని, అందుక‌నే ప్ర‌జెంటేష‌న్ వేడుక‌కు రాలేద‌ని అంటున్నారు.

ఇక మ్యాచ్ అనంత‌రం సూర్య మాట్లాడుతూ.. ఈ గెలుపును పహల్గాం ఉగ్రదాడి బాధితులు, సాయుధ బలగాలకు అంకితమిస్తున్నట్లు తెలిపాడు. పహల్గాం ఉగ్రవాద దాడి బాధితుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఇదే సరైన సందర్భమని భావిస్తున్న‌ట్లు చెప్పుకొచ్చాడు.

Hardik Pandya : చ‌రిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. పాక్ పై ఒకే ఒక్క భార‌తీయుడు..

‘బాధిత కుటుంబాలకు మా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించిన మన సాయుధ దళాలన్నింటికీ ఈ విజయాన్ని అంకితం చేయాలని అనుకుంటున్నాం. మనందరికీ వారు స్ఫూర్తినిస్తూనే ఉంటారు. అవకాశం దొరికినప్పుడల్లా వారి ముఖాల్లో చిరునవ్వు ఉండే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాం.’ అంటూ సూర్య కుమార్ యాదవ్ అన్నాడు.